Central Government : నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి మహిళలకు అనుమతి
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి మహిళలను అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.

Central Government
National Defence Academy : కేంద్ర ప్రభుత్వం మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి మహిళలను అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. త్రివిధ దళాల అధిపతులతో చర్చించిన అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశానికి మార్గం సుగమమైందని చెప్పవచ్చు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశం కోసం మహిళలు కూడా పరీక్షలు రాసేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టు గత నెల 18వ తేదీన ఆదేశించిన విషయం విధితమే. ఈ మేరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. లింగ వివక్ష ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలోనే ఇవాళ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలకు అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశం కోసం మహిళలు కూడా పరీక్షలు రాసేందుకు అనుమతి లభించనుంది. ఇక నుంచి మహిళలు కూడా నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలు రాయనున్నారు.