Central Govt : నేడు శ్రీలంక పరిణామాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం
శ్రీలంక పరిణామాలపై భారత వైఖరి, ఆర్ధిక సహకారం తదుపరి చర్యలపై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలకు వివరించనున్నారు. శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని డిఎంకె, ఎఐఎడిఎంకె డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.

All Party Meeting
central government : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, జరుగుతున్న పరిణామాలపై నేడు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. శ్రీలంక పరిణామాలపై భారత వైఖరి, ఆర్ధిక సహకారం తదుపరి చర్యలపై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలకు వివరించనున్నారు. శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని డిఎంకె, ఎఐఎడిఎంకె డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో తమిళనాడుకు చెందిన రెండు పార్టీలు శ్రీలంక అంశాన్ని లేవనెత్తాయి. శ్రీలంకలో తమిళ జనాభా ఉండటంతో అక్కడి పరిణామాలపై అఖిలపక్షంలో చర్చ జరగనుంది. గడిచిన ఏడు దశాబ్దాలలో శ్రీలంక అత్యంత దారుణమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తీవ్రమైన విదేశీ మారకద్రవ్యం కొరత, ఆహారం, ఇంధనం, విద్యుత్ కోతలు, మందులు సహా నిత్యావసరాల దిగుమతి లేకపోవడంతో శ్రీలంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Sri Lanka: శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన విక్రమెసింఘె
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటు తర్వాత ఆర్థిక సంక్షోభంతో పాటు ప్రస్తుతం శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా 100 రోజులుగా రాష్ట్రపతి కార్యాలయం వద్ద ఆ దేశ ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భారత్ మానవతా దృక్పథంతో శ్రీలంకకు సహాయం చేస్తోంది. భారత్.. ఈ సంవత్సరం శ్రీలంకకు విదేశీ సహాయానికి ప్రధాన వనరుగా ఉంది. శ్రీలంకలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఆర్థిక స్థిరత్వానికి తమ మద్దతును కొనసాగిస్తామని శ్రీలంకకు భారత్ హామీ ఇచ్చింది.