Viral Video : స్ట్రీట్ చిల్డ్రన్‌కి 5 స్టార్ హోటల్ ట్రీట్.. అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తి

స్ట్రీట్ చిల్డ్రన్‌కి ఫైవ్ స్టార్ హోటల్ ట్రీట్ ఇచ్చే ఉదారమైన మనస్తత్వం ఎంతమందికి ఉంటుంది ? వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మనసు చలించిపోతుంది.

Viral Video : స్ట్రీట్ చిల్డ్రన్‌కి 5 స్టార్ హోటల్ ట్రీట్.. అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తి

Viral Video

Viral Video :  ట్రాఫిక్ మధ్యలో సడెన్‌గా కొందరు చిన్నారులు కార్ల దగ్గరకి రావడం.. అద్దాలు తుడవడం.. ఆ తర్వాత సాయం కోరడం గమనిస్తూ ఉంటాం. పేదరికం, ఆకలి కొందరు వీధి బాలలను ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. చాలామంది వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తే మరికొందరు వారి కడుపు నింపే ప్రయత్నం చేస్తారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో  ఓ వ్యక్తి వీధి బాలల పట్ల చూపిన కరుణని చూస్తే కళ్లు చమ్మగిల్లుతాయి.

KCR : ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జనం ముందుకు వచ్చిన కేసీఆర్.. వీడియో వైరల్

వీధుల్లో.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కార్లు తుడుస్తూ, ఏవో వస్తువులు అమ్ముతూ కొందరు చిన్నారులు కనిపిస్తుంటారు. కొందరు వారి పరిస్థితి చూసి వారి తల్లిదండ్రులను తిడుతుంటారు. మరికొందరు వారికి తోచిన పైసలు ఇస్తుంటారు. నిజానికి చదువుకోవాల్సిన బాల్యంలో వారు పడే కష్టం చూస్తే బాధనిపిస్తుంది. ఆ సమయంలో వారికి కావాల్సింది తిండి, బట్టలు, విద్య. కానీ వారి అవసరాలు తీర్చే వారు లేక రోడ్లపై కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మనసు చలించిపోతుంది. తన కారు అద్దాలు క్లీన్ చేస్తున్న పిల్లల్ని ఓ వ్యక్తి  ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి తీసుకెళ్లి కడుపారా భోజనం తినిపించాడు. వారితో సరదాగా గడిపి తిరిగి క్షేమంగా సాగనంపాడు.

kawalchhabra అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మీకు శ్రద్ధ ఉంటే షేర్ చేయండి. ట్రాఫిక్ లైట్ దగ్గర, 5 స్టార్ హోటల్ దగ్గర ఆహారం కోసం కార్లను శుభ్రం చేస్తున్న పిల్లల్ని చూసాను. వాళ్లకి డబ్బులు ఇవ్వకుండా నా కారులోకి ఆహ్వానించాను. ఫైవ్ స్టార్ హోటల్‌లోకి తీసుకెళ్లినపుడు వారి కళ్లు పెద్దవయ్యాయి. కలిసి కూర్చున్నప్పుడు వారి ఆనందం నిజమైంది..నాకెంతో నచ్చింది. భోజనాన్ని ఆస్వాదిస్తూ నాకు వందసార్లు కృతజ్ఞతలు తెలిపారు. మనం విజయాలు సాధించడంలోనే కాదు.. ఇతరుల కలలను నిజం చేయడంలో కూడా జీవితం అందంగా ఉంటుంది’ అనే శీర్షికతో ఆ చిన్నారుల గురించి మనసుని హత్తుకునేలా పోస్టు రాసుకొచ్చాడు.

Sitara : క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన మహేష్ గారాలపట్టి.. సితార ఇన్‌స్టా రీల్ వైరల్..

సోషల్ మీడియాలో ఈ వీడియో 39 మిలియన్లకు పైగా వీక్షణలు పొందింది. ‘సర్దార్ జీ, మీకు హ్యాట్సాఫ్’ .. ‘ఇది నా కళ్లలో కన్నీరు తెప్పించింది’ .. ‘ఈ నెల అత్యుత్తమమైన వీడియో’ అని నెటిజన్లు వరసగా కామెంట్స్ పెట్టారు. నిజంగానే ఆ వయసులో పిల్లలకు కావాల్సింది కాస్త ఆదరణ.. ఆకలేస్తే కడుపునిండా అన్నం.. చదువుకోవాల్సిన చేతుల్తో కారు అద్దాలు తుడుస్తూ కష్టపడే చిన్నారులకు పైసలు ఇవ్వకుండా బోలెడంత సంతోషాన్ని నింపిన కవల్ చబ్రాకి అభినందనలు చెప్పాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Kawaljeet Singh (@kawalchhabra)