మూడో విడత పోలింగ్ : పశ్చిమబెంగాల్లో చెలరేగిన హింస

మూడో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్లో హింస చెలరేగింది. తృణమూల్- కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ ఓటరు మృతి చెందాడు.

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 04:17 PM IST
మూడో విడత పోలింగ్ : పశ్చిమబెంగాల్లో చెలరేగిన హింస

Updated On : April 23, 2019 / 4:17 PM IST

మూడో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్లో హింస చెలరేగింది. తృణమూల్- కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ ఓటరు మృతి చెందాడు.

మూడో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్లో హింస చెలరేగింది. తృణమూల్- కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ ఓటరు మృతి చెందాడు. మరికొన్నిచోట్ల బీజేపీ- టీఎంసీ కార్యకర్తలు కొట్టుకున్నారు. ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది.

మూడో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్లో భాగంగా  పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముర్షిదాబాద్లోని బలిగ్రామ్లో టిఎంసి- కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఓటు వేయడానికి వచ్చి క్యూలో నిల్చున్న ఓ ఓటరు కత్తిపోటుకు గురై   మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని బాలిగ్రామ్ వాస్తవ్యుడు తియారుల్ కలామ్గా గుర్తించారు

ముర్షిదాబాద్లో ఓ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ- టీఎంసీ కార్యకర్తలు కొట్టుకున్నారు. ఓటు వేయడానికి వెళ్తున్న బీజేపీ మద్దతుదారులపై దాడికి పాల్పడ్డారు. మరికొన్ని చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. ఓ పోలింగ్ బూత్ బయట ఏర్పాటు చేసిన టెంట్లను పీకేశారు.  తృణమూల్ కాంగ్రెస్ రిగ్గింగ్ చేసేందుకు యత్నించిందని బీజేపీ ఆరోపించింది. 

మూడో విడత ఎన్నికల్లో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా జరిగింది. కేరళ, అసోం, ఉత్తరప్రదేశ్లో ఈవీఎంల పనితీరుపై విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈవీఎంలో ఏ బటన్ నొక్కినా కమలానికే ఓటు పడుతుందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. మొత్తానికి చెదురు మొదురు ఘటనలు మినహా మూడో విడత ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.