Mamata Banerjee : లోక్‌సభ నుంచి ఎంపీ మొహువా మొయిత్రా బహిష్కరణ బీజేపీ ప్రతీకార రాజకీయం : మమతా బెనర్జీ

బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. మొహువా వైఖరిని వివరించడానికి బీజేపీ ఆమెను అనుమతించలేదన్నారు.

Mamata Banerjee : లోక్‌సభ నుంచి ఎంపీ మొహువా మొయిత్రా బహిష్కరణ బీజేపీ ప్రతీకార రాజకీయం : మమతా బెనర్జీ

Mamata Banerjee

Updated On : December 8, 2023 / 4:44 PM IST

West Bengal CM Mamata Banerjee : టీఎంసీ ఎంపీ మొహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. మొహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. లోక్‌సభ నుంచి ఎంపీ మొహువా మొయిత్రా బహిష్కరణను మమతా బెనర్జీ ఖండించారు. ఇది ప్రజాస్వామ్యానికి దురదృష్టకరమని, ఇది అన్యాయం అన్నారు. బీజేపీ వైఖరిని చూసి తాను బాధపడుతున్నానని తెలిపారు. బీజేపీ ప్రజాస్వామ్యానికి ద్రోహం చేస్తుందని విమర్శించారు. ఇది బీజేపీ ప్రతీకార రాజకీయమని ఆరోపించారు.

బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. మొహువా వైఖరిని వివరించడానికి బీజేపీ ఆమెను అనుమతించలేదన్నారు. మొహువాకి అన్యాయం జరిగిందని వాపోయారు. టీఎంసీ ఇండియా కూటమీతో కలిసి పోరాడుతుందన్నారు. ఈ యుద్ధంలో మొహువా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మొహువాకు న్యాయం చేస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందన్నారు.

Mahua Moitra : టీఎంసీ ఎంపీ మొహువా మొయిత్రా లోక్‌స‌భ సభ్యత్వం రద్దు

టీఎంసీ ఎంపీ మొహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వం రద్దు అయింది. నైతిక విలువల కమిటీ నివేదికతో లోక్ సభ మొహువా మొయిత్రా సభ్యత్వం రద్దు చేసింది. నైతిక విలువల కమిటీ నివేదికకు లోక్ సభ ఆమోదం తెలిపింది. డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని మొహువా మొయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. ఎథిక్స్ కమిటీ నివేదికతో మొయిత్రాపై చర్యలు తీసుకుంది.

ఎంపీ మొహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని మొహువా మొయిత్రాపై ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ లోక్ సభలో నివేదికతో మెయిత్రాపై చర్యలు తీసుకుంది. మొహువాను లోక్ సభలో చర్చల్లో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆమె లోక్ సభ బయటికి వచ్చి మాట్లాడారు.