Covid-19 : దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 25,404 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం 27,176 నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,51,087కి చేరింది.

Covid-19 : దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Corona Update

Updated On : September 15, 2021 / 12:29 PM IST

Covid-19 : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 25,404 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం 27,176 నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,51,087కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 284 మంది కరోనాతో మృతి చెందారు.

Read More : Corona Virus: ఒకే ఒక్క కరోనా కేసు.. లాక్డౌన్ విధించిన ప్రభుత్వం

దీంతో ఇప్పటివరకు 4,43,497మంది కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 75.89 కోట్ల మోతాదుల వ్యాక్సిన్లను అందించామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1.05 శాతం ఉన్నాయి. రికవరీ రేటు 97.62 శాతం. గత 24 గంటల్లో కనీసం 38,012 మంది కోలుకున్నారు. వీక్లీ పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉంది. గత 16 రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు 1.69 శాతంగా నమోదైంది.

Read More : Phone Blasted In Court : కోర్టులో పేలిన ఫోన్..పోరాటం చేస్తానంటున్న న్యాయవాది

గతేడాది సెప్టెంబర్‌లో దాదాపు 60 లక్షల కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ నాటికి కోటి మార్కును దాటింది. కోవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ ముప్పు ఇంకా పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు. దేశంలో అత్యధిక కేసులు కేరళలో నమోదవుతున్నాయి. దేశంలోని కేసుల్లో 75 శాతం కేసులు ఈ ఒక్క రాష్ట్రం నుంచే వస్తున్నాయి.