Corona Update : దేశంలో పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 7,286 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.

Corona Update : దేశంలో పెరిగిన కరోనా కేసులు

corona virus

Updated On : December 25, 2021 / 10:30 AM IST

Corona Update : దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 7,286 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ఇదే సమయంలో 387 మంది కరోనా మృతి చెందినట్లు తెలిపింది. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,79,520పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసులు 77,032గా ఉన్నాయి. ఇక కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 3,42,23,263గా ఉంది.

చదవండి : Corona Restrictions : తెలంగాణలో మరోసారి కరోనా ఆంక్షలు ? క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై సస్పెన్స్‌

ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 141.01 కోట్ల డోసులను పంపిణి చేసింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది. దేశంలో 415 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒమిక్రాన్ నుంచి 115 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లినట్లు పేర్కొంది. 17 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో ఉండగా తెలంగాణ 4వస్థానంలో ఉంది.

ఇదిలా ఉంటే తెలంగాణలో మొదటి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ తెలిపింది. రెండో డోస్ 62 శాతం మందికి ఇచ్చినట్లు పేర్కొంది.

చదవండి : AP Corona Cases : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. మరో ముగ్గురు మృతి