Karnataka New CM : ఈ రోజు సాయంత్రం కర్ణాటక సీఎం ప్రకటన!

మంగళవారం సాయంత్రం 5 గంటలకు కర్ణాటక నూతన సీఎం పేరు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ పెద్దలు కర్ణాటకకు చేరుకున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలతో చర్చించి.. అనంతరం సీఎం ప్రకటన చేయనున్నారు.

Karnataka New CM : ఈ రోజు సాయంత్రం కర్ణాటక సీఎం ప్రకటన!

Karnataka New Cm

Updated On : July 27, 2021 / 12:07 PM IST

Karnataka New CM : బీఎస్ యడియూరప్ప సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. తదుపరి సీఎం వచ్చే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి కోసం కేంద్ర పెద్దలు చర్చలు ప్రారంభించారు. యడియూరప్ప రాజీనామా అనంతర పరిస్థితులపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాలు, గనుల శాఖ మంత్రి ప్రహ్లోద్ జోషి ఢిల్లీలో రహస్య మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది.

యడియూరప్ప రాజీనామా తర్వాత పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకుందనేదుకు ఓ బృందాన్ని మంగళవారం కర్ణాటకకు పంపాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక ఈ బృందంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ తోపాటు మరికొందరు నేతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

వీరు కర్ణాటక వెళ్లి స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి ఈ రోజు సాయంత్రం వరకు సీఎం ఎవరనేది తేల్చుతారని సమాచారం. ఇక ఇదే అంశంపై ప్రధాని మోదీతోపాటు, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జనరల్ సెక్రెటరీ బీఎల్ సంతోష్ చర్చించారు. ఇక ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కర్ణాటక సీఎం ప్రకటన ఉండనుంది. మొదట గురువారం సీఎంను ప్రకటిస్తారని అందరు భావించారు. కానీ పార్టీ పెద్దల అనూహ్య నిర్ణయంతో ఈ రోజు సాయంత్రానినే సీఎం ఎవరేంది వెల్లడి కానుంది.