గుడ్‌న్యూస్.. ప్రయాణాలు బాగా చేస్తుంటారా? మంత్లీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. డిస్కౌంట్లు..
మీరు తరుచూ జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తుంటారా?

మీరు ప్రయాణాలు బాగా చేస్తుంటారా? జాతీయ రహదారులపై మీ వాహనాలను బాగా తిప్పేస్తుంటారా? మీకో గుడ్‌న్యూస్.. త్వరలోనే మంత్లీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డులు వచ్చే అవకాశం ఉంది.
వీటిని దేశంలోని అన్ని టోల్ బూత్‌లలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఏ రోజు నుంచైనా అమలు చేయడానికి అనుకూలంగా ఉన్నారు.
మంత్లీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డుల పథకం అమలైతే టోల్ ఛార్జీలపై కార్డుదారులకు డిస్కౌంట్ లభిస్తుందని తెలుస్తోంది. రెగ్యులర్‌గా ట్రావెల్ చేసేవారికి ఇది పెద్ద రిలీఫ్‌గానే చెప్పుకోవాలి. అలాగే, కమర్షియల్ వాహనాలకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది.
ఈ కొత్త కార్డుపై పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. నెలవారీ పాస్ తీసుకోని ప్రయాణికులు రెగ్యులర్ టోల్ చెల్లించాల్సి ఉంటుందా? లేదా వారికి కూడా డిస్కౌంట్ లభిస్తుందా? అనే విషయంపై స్పష్టత లేదు.
iPhone 16 Pro: అదిరిపోయే ఆఫర్.. అతి తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 16ప్రో
టోల్ ప్లాజాల వద్ద చెల్లింపుల విధానాన్ని మంత్లీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డుల పథకం మరింత సరళీకృతం చేయనుంది. ఈ స్మార్ట్ కార్డ్ ముఖ్యంగా కమర్షియల్ వాహనాలకు బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.
కమర్షియల్ వాహనాలు దేశంలో చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో టోల్ ప్లాజాలను దాటాల్సి వస్తుంది. సాధారణ ప్రయాణికులపై కూడా ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. మంత్లీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డుల విషయంలో కేంద్ర సర్కారు త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇది అమలైతే దేశ వ్యాప్తంగా తరుచూ ప్రయాణాలు చేసేవారికి టోల్ పన్నుల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. టోల్ కలెక్షన్ కోసం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్‌ఎస్ఎస్)ను కూడా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.