లవ్ జిహాద్ చెక్ పెట్టడానికి కఠినమైన చట్టం – యోగి ఆదిత్యనాథ్

tougher law against ‘love jihad’ : లవ్ జిహాద్ చెక్ పెట్టడానికి కఠినమైన నిర్ణయం తీసుకుంటామని, సమర్థవంతమైన చట్టాన్ని తీసుకొస్తామని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఆడబిడ్డల, అక్కాచెల్లెమ్మల గౌరవ మర్యాదలతో కొందరు ఆటలాడుకుంటున్నారని, వారు ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే రామ్‌నామ్ సత్య యాత్ర ప్రారంభిస్తామని గట్టిగా హెచ్చరించారు.
Malhani ఉప ఎన్నిక సందర్బంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మల్హానీ అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. లవ్ జిహాద్‌లో భాగస్వాములైన వారి పోస్టర్లను రోడ్ల పక్కన ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
పెళ్లి కోసమే మతం మారడం సరికాదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. అలాంటి వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకొస్తామన్నారు.