కుప్పకూలిన శిక్షణా విమానం..పైలట్‌కు గాయాలు

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 09:37 AM IST
కుప్పకూలిన శిక్షణా విమానం..పైలట్‌కు గాయాలు

Updated On : February 5, 2019 / 9:37 AM IST

పుణెలోని ఇందపూర్‌ సమీపంలో ఒక శిక్షణ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలట్‌ గాయపడ్డాడు. ఈ సంఘటనలో విమానం పూర్తిగా దెబ్బతింది. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు ఎయిర్‌క్రాఫ్ట్‌ టేకాఫ్‌ కాగా, కొద్దిసేపటికే అది కుప్పకూలిపోయింది. ప్రమాదస్థలికి స్థానికులు చేరుకుని గాయపడిన పైలట్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన బారామతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

పైలట్‌ సిద్ధార్థ్‌కు చేతికి తీవ్ర గాయమైనట్లు వైద్యులు తెలిపారు. ఇక ప్రమాద స్థలానికి చేరుకున్న కార్వేర్‌ ఏవియేషన్‌ అధికారులు.. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.