Train Derail : ప్రయాగరాజ్ రైల్వేస్టేషనులో మళ్లీ పట్టాలు తప్పిన రైలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి రైలు పట్టాలు తప్పింది. యూపీలోని ప్రయాగరాజ్ రైల్వేస్టేషనులో రెండు బోగీలు, రైలు ఇంజన్ మంగళవారం రాత్రి పట్టాలు తప్పింది.....

Train Derail
Train Derail : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి రైలు పట్టాలు తప్పింది. యూపీలోని ప్రయాగరాజ్ రైల్వేస్టేషనులో రెండు బోగీలు, రైలు ఇంజన్ మంగళవారం రాత్రి పట్టాలు తప్పింది. రైలు బయలుదేరాక ఒక్కసారిగా పట్టాలు తప్పిందని, దీనికి కారణాలను కనుక్కుంటామని రైల్వే అధికారులు చెప్పారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ మధ్య నడిచే సుహైల్‌దేవ్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు కోచ్‌లు, ఇంజన్ మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పినట్లు ఉత్తర మధ్య రైల్వే తెలిపింది.
Also Read : Sachin,Sara Love story : నాడు సచిన్ పైలట్, సారా అబ్దుల్లాల ప్రేమ పెళ్లి…నేడు విడాకులు
‘‘రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది, ఇంజిన్ రెండు చక్రాలు ట్రాక్ నుంచి విడి పోయాయి. ఇంజిన్ వెనుక ఉన్న రెండు కోచ్‌లు కూడా పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు’’ అని ఉత్తర మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. రైలు బోగీల చక్రాలు ట్రాక్ నుంచి బయటకు వచ్చాయి.
Also Read : Commercial LPG cylinder : వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర మళ్లీ పెంపు
ఈ ప్రమాదం 6వ నంబర్ ఫ్లాట్ ఫాం నుంచి రైలు బయలు దేరాక జరిగిందని రైల్వే అధికారులు చెప్పారు. ఇటీవల తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. విజయనగరం రైలు ప్రమాద ఘటన జరిగి వారం రోజులు గడవక ముందే మరో రైలు పట్టాలు తప్పింది. తరచూ రైలు ప్రమాదాలతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.