Uber: యూబర్ ఇంజినీర్ పోస్టులకు 250 ఖాళీలు
హైదరాబాద్‌లో, బెంగళూరులో 250మంది ఇంజినీర్ ఉద్యోగాల కోసం యూబర్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా తమ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ సర్వీసును విస్తరించేందుకు గానూ రిక్రూట్మెంట్ పెంచనున్నట్లు పేర్కొంది.

Uber To Hire Close To 250 Engineers In India
Uber: హైదరాబాద్‌లో, బెంగళూరులో 250మంది ఇంజినీర్ ఉద్యోగాల కోసం యూబర్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా తమ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ సర్వీసును విస్తరించేందుకు గానూ రిక్రూట్మెంట్ పెంచనున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం తీసుకోనున్న హైరింగ్‌తో.. రైడర్, డ్రైవింగ్ గ్రోత్, డెలివరీ సర్వీస్, తినే వస్తువులు, డిజిటల్ పేమెంట్స్, రిస్క్ నుంచి పరిష్కారం, మార్కెట్ ప్లేస్, కస్టమర్ అవసరాలు, డేటా, సేఫ్టీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ టీమ్స్ అన్నీ మెరుగవుతాయని యూబర్ స్టేట్మెంట్ లో చెప్పింది.
ప్రస్తుతం ఈ వేకెన్సీలు హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. యూబర్ ఈ నిర్ణయంతో 10వేల నగరాలకు వెన్నెముకలా మారాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది.