UGC NET : జూన్ 13 నుంచి యూజీసీ నెట్ పరీక్షలు
తొలి దశలో జూన్ 13 నుంచి 17వరకు, రెండో దశలో జూన్19 నుంచి 22 వరకు పరీక్షలు జరుగున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు.

UGC NET
UGC NET Exams : దేశ వ్యాప్తంగా జూన్ 13 నుంచి యూజీసీ నెట్ పరీక్షలు జరుగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థులకు ఎన్టీఏ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. తొలి దశలో జూన్ 13 నుంచి 17వరకు, రెండో దశలో జూన్19 నుంచి 22 వరకు పరీక్షలు జరుగున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు.
జూన్19 నుంచి 22 వరకు జరుగనున్న రెండో దశ పరీక్షలకు అడ్మిట్ కార్డులను త్వరలో విడుదల చేయనున్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుల్లో తప్పులు ఉంటే ugcnet@nta.ac.inకు మెయిల్ చేయాలని ఎన్టీఏ తెలిపింది.