Budget 2025 : బడ్జెట్ లో రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్.. 7.7కోట్ల మందికి ప్రయోజనం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో రైతులకు శుభవార్త చెప్పారు.

Minister Nirmala Sitharaman
Budget 2025 : మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఉదయం 11గంటలకు ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు శుభవార్త చెప్పారు. కిసాన్ క్రిడెట్ కార్డు ద్వారా రైతులకు అందించే లోన్ పరిమితిని రూ.3లక్షల నుంచి రూ. 5లక్షలకు పెంచుతున్నట్ల ప్రకటించారు.
Also Read: Gold Price Today : కేంద్ర బడ్జెట్‌కు ముందుగానే భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచడం ద్వారా రైతులకు మేలు జరగనుంది. రైతుల ఆదాయ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది. రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి సులభతరంగా రుణాలు పొందుతున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు అమల్లోకి తీసుకొచ్చిన తరువాత ఇప్పటి వరకు ఎలాంటి ప్రధానమైన మార్పులు చేయలేదు. ఈ కార్డు తీసుకున్న రైతులకు పలు దఫాలుగా రుణాలు ఇస్తున్నారు. అయితే, ప్రస్తుతం రూ. 3లక్షల పరిమితిని రూ. 5లక్షలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 7.7కోట్ల మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి మేలు జరగనుంది.
కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ తొలుత 1998లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పంట పండించేందుకు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు అవసరమైన నిధులను సులభవంగా తక్కువ వడ్డీతో అందించాలనే లక్ష్యంతో ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రభుత్వం తీసుకొచ్చింది.