Repealed Farm Laws : కేంద్రమంత్రి తోమర్ యూ టర్న్, అలా అనలేదు

వ్యవసాయచట్టాలపై కేంద్ర వైఖరిలో వచ్చిన మార్పు.. తాత్కాలికమా.. లేక శాశ్వతమా అన్నది తేలాలంటే.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసేదాకా ఎదురు చూడాల్సిందే.

Repealed Farm Laws : కేంద్రమంత్రి తోమర్ యూ టర్న్, అలా అనలేదు

Tomar

Updated On : December 26, 2021 / 1:56 PM IST

Union minister Tomar Farm Laws : మూడు వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం ఎన్నికల స్టంటేనా..? మరింత పకడ్బందీగా ఈ చట్టాలను తెచ్చేందుకు కేంద్రం సిద్ధమైందా..? అదను చూసి సాగుచట్టాలు అమలుచేయనుందా..? కేంద్ర వ్యయసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతోంది. రైతుల మేలు కోసం ఒక్క అడుగు వెనక్కి వేశామని..భవిష్యత్తులో మళ్లీ చట్టాలు తెస్తామని తోమర్ ప్రకటించారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో తోమర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు దేశవ్యాప్తంగా దుమారం సృష్టిస్తున్నాయి.

Read More : Boiler explodes: బాయిలర్‌ పేలుడు.. 5 మంది మృతి

తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవడంతో తోమర్ స్పందించారు. కేంద్రం మళ్లీ చట్టాలు తీసుకొస్తుందని.. తానెప్పుడూ చెప్పలేదన్నారు. అయితే…వ్యవసాయ చట్టాల ముప్పు తొలగిపోలేదేని..మళ్లీ ముంచుకొస్తుందని తోమర్ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు అలా ముగిశాయో లేదో…ఇలా కేంద్రమంత్రి తోమర్ తన మనసులో మాట బయటపెట్టేశారు. ప్రస్తుతం అలా అనలేదని అంటున్నారు.

Read More : Visakhapatnam IIM : విశాఖ ఐఐఎం లో పిజీపీ లో ప్రవేశాలు

గత ఏడాది మూడు వ్యవసాయ చట్టాల ఆమోదం తర్వాత రైతులు భగ్గుమన్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ నుంచి లక్షలాదిగా తరలివచ్చిన రైతులు ఢిల్లీని వణికించారు. సరిహద్దుల్లోనే స్థావరాలు ఏర్పరుచుకుని చట్టాల రద్దు కోసం పోరాడారు. ఏడాది కాలంలో విజ్నాన్ భవన్‌లో రైతు సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు సరికదా..ఒక్కసారి కూడా…అవి సంతృప్తికరంగా సాగలేదు. రైతు సంఘాలు చేస్తున్న ఏ డిమాండ్లనూ కేంద్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్‌లో హింస చెలరేగిన తర్వాత ఇక ఇరువర్గాల మధ్య చర్చలన్నదే జరగలేదు. రైతులు సరిహద్దులనే తమ నివాసప్రాంతాలుగా మార్చుకుని అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలోనే రైతు ఉద్యమం ఏడాది కాలం పూర్తిచేసుకుంది. ప్రాణాలకు తెగించి..రైతులు పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న భావనలోకి వెళ్లిపోయారు దేశ ప్రజలు.

Read More : Stomach Leeches : జీవాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే పొట్ట జలగలు

ఆ సమయంలో ఎవరూ ఊహించని విధంగా అసాధారణ నిర్ణయం ప్రకటించారు ప్రధాని. వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. మాట ఇచ్చిందే తడవుగా కార్యాచరణ ప్రారంభించారు. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదించి. వెంటనే ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేశారు. ప్రతిపక్షాలు నోరుతెరవకుండా కట్టడి చేశారు. ఈ అసాధారణ చర్య అందరినీ నివ్వెరపరిచినప్పటికీ…రైతులకు మేలు జరిగిందని అంతా సంతోషించారు. కానీ…వ్యవసాయచట్టాలపై కేంద్ర వైఖరిలో వచ్చిన మార్పు.. తాత్కాలికమా.. లేక శాశ్వతమా అన్నది తేలాలంటే.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసేదాకా ఎదురు చూడాల్సిందే.