కూతురు ముందే జర్నలిస్ట్‌పై కాల్పులు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విజయనగర్ ప్రాంతంలో జర్నలిస్ట్ విక్రమ్ జోషిపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడికి దిగారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది.
ఈ సిసిటివి ఫుటేజీలో విక్రమ్ జోషి తన ఇద్దరు కుమార్తెతో మోటారుసైకిల్‌పై వెళుతుండగా దాడి చేశారు. దుండగులు జర్నలిస్ట్‌ని చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
సుమారు 5నుంచి 6మంది దుండగులు విక్రమ్ జోషిని చుట్టుముట్టి ఈ చర్యకు పాల్పడ్డారు. విక్రమ్ జోషిని కాల్చిన తరువాత వారు తప్పించుకున్నారు. తండ్రి గాయపడటం చూసి, కుమార్తె సహాయం కోసం వేడుకోగా.. ఈ సంఘటన మొత్తం సీసీటీవిలో బంధించబడింది. సీసీటీవి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఐదుగురు నిందితులను పట్టుకున్నారు.
విక్రమ్‌జోషి మేనకోడలితో కొంతమంది అబ్బాయిలు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో వారిపై పోలీసు స్టేషన్‌లో లిఖితపూర్వక జోషి ఫిర్యాదు చేశారు. దీంతో తమ మేనకోడలిని ఏడిపించిన దుండగులే ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డారాని విక్రమ్ జోషి బంధువులు చెబుతుపన్నారు. కాల్పుల్లో విక్రమ్ జోషి తలకు బులెట్ తగిలింది. ఘజియాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.