కశ్మీర్ నుంచి యూపీకి: ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్
పుల్వామా ఉగ్రదాడి ఘటనతో భారత భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఎవరూ అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు.

పుల్వామా ఉగ్రదాడి ఘటనతో భారత భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఎవరూ అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు.
పుల్వామా ఉగ్రదాడి ఘటనతో భారత భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఎవరూ అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. జేషే-ఈ-మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులనే అనుమానంతో ఇద్దరు యువకులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని షహరాన్ పూర్ జిల్లాలోని డియోబ్యాండ్ దగ్గర అర్ధరాత్రి జరిపిన తనిఖీల్లో ఈ ఇద్దరిని పట్టుకున్నారు. అందిన ప్రాథమిక నిఘా వర్గాల సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్టు డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు.
ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో (20ఏళ్ల నుంచి 25ఏళ్లు) ఒకరు కుల్గం వాసీ షహనవాజ్, అక్విబ్ పుల్వామాకు చెందినవారిగా గుర్తించినట్టు డీజీపీ చెప్పారు. వీరిద్దరూ జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరి నుంచి రెండు ఆయుధాలను ఏటీఎస్ బృందం స్వాధీనం చేసుకుంది. వీరిలో షహనవాజ్ గ్రెనేడ్ ఎక్స్ ఫర్ట్ గా గుర్తించినట్టు డీజీపీ తెలిపారు. కశ్మీర్ నుంచి యూపీకి ఎందుకు వచ్చారు, వీరి డీల్ ఏంటో రాబట్టేందుకు విచారిస్తున్నట్టు సింగ్ చెప్పారు.