Uttarakhand Silkyara Tunnel : సొరంగాన్ని జయించిన కార్మికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం .. ఒక్కొక్కరికి ఎంతో తెలుసా..?

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్ లో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన కార్మికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. 

Uttarakhand Silkyara Tunnel : సొరంగాన్ని జయించిన కార్మికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం .. ఒక్కొక్కరికి ఎంతో తెలుసా..?

Uttarakhand CM Dhami

Updated On : November 29, 2023 / 12:26 PM IST

Silkyara tunnel rescued Workers  : ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్ లో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన కార్మికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈసొరంగంలో మొత్తం 41మంది కార్మికులు చిక్కుకుని 17 రోజుల తరువాత రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా నెరవేరటంతో సురక్షితంగా బయటకొచ్చారు. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటించింది. సీఎం పుష్కర్ ధామీ ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.  అలాగే కార్మికులకు చికిత్సతో పాటు వారంతా తమ ఇళ్లకు చేరేవరకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

PM Modi : సొరంగం నుంచి బయటపడ్డ కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ.. మీ ధైర్యం, సాహసం గొప్పవి అంటూ ప్రశంసలు

కాగా..పొట్టకూటి కోసం ఉత్తరాఖండ్ వచ్చిన కూలీలు ఉత్తరకాశీ సిల్క్యరా సొరంగంలో 41మంది కార్మికులు 17 రోజులు చిక్కుకుపోయారు. ఎంతోమంది కృషికి ఫలితంగా..సొరంగం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 17 రోజులపాటు సొరంగంలో నరకయాతన అనుభవించారు. ఈ క్రమంలో నిర్వరామంగా రెస్క్యూ టీమ్ ఆపరేషన్ తో ఎట్లకేలకు మంగళవారం (నవంబర్ 28,20230 రాత్రి అందరు సురక్షితంగా బయటపడ్డారు. వారంతా క్షేమంగా బయటకొచ్చి వారి కుటుంబాలను కలుసుకోవాలని యావత్ భారతం కోరుకుంది. ఎంతోమంది వారి కోసం ప్రార్ధించారు. ఎట్టకేలకు 41మంది కార్మికులు సొరంగాన్ని జయించారు. మృత్యుంజయులుగా బయటపడ్డారు.

వారి ధైర్యాన్ని ప్రధాని మోదీ సైతం ప్రశించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలో తమవారు సురక్షితంగా సొరంగం నుంచి బయటకు రావటంతో కార్మికుల కుటుంబ సభ్యులు బాణసంచా కాల్చుకని సంబరాలు చేసుకున్నారు. మరోసారి దీపావళి పండుగ జరుపుకున్నారు. మిఠాయిలు తినిపించుకుని ఆనందాలను పంచుకున్నారు. సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు వివిధ రాష్ట్రాలకు చెందినవారు కావటంతో వారి గ్రామాల్లో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సొరంగాన్ని జయించిన కార్మికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించటంతో అది వారికి కొంతలో కొంతైనా ఊరట కలుగనుంది.

శ్రామికుల జీవితాల్లో మళ్లీ దీపావళి.. సొరంగం నుంచి బయటపడ్డ కార్మికుల గ్రామాల్లో బాణసంచా కాల్చి సంబరాలు

కాగా..సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్వాగతం పలికారు.వారి మెడిలో పూల మాల వేసి స్వాగతం పలికారు.కాగా ఈ రెస్క్యూ ఆపరేషన్ ను సీఎం పర్యవేక్షించిన విషయం తెలిసిందే.