UP Election : లుంగీ వేసుకున్న వారంతా నేరస్తులేనా..ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
యూపీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత కేశవ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది.

Up Lungi
People Wearing Lungis Not Criminals : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొంది. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ..పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ, పాగా వేయాలని కాంగ్రెస్..ఇలా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. వచ్చే ఏడాదే ఎన్నికలు వస్తుండడంతో..ఇప్పటి నుంచే నేతలు రెడీ అయిపోతున్నారు. పార్టీల అధినేతలు రాష్ట్రంలో కలియతిరుగుతున్నారు. వ్యూహాత్మకంగా ప్రసంగాలు చేస్తూ..ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే..నేతల వ్యాఖ్యలు వివాదాస్పదమౌతున్నాయి.
Read More : Punjab Election : బీజేపీలో చేరితే డబ్బు,మంత్రి పదవి ఇస్తామన్నారు..ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
తాజాగా..యూపీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత కేశవ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత రషీద్ అల్వీ మాట్లాడారు. లుంగీ ధరించిన వారంతా..నేరస్థులేనా ? అంటూ మండిపడ్డారు. యూపీలో ఉండే హిందువుల్లో చాలా మంది లుంగీ ధరిస్తారని చెప్పుకొచ్చారు. కొన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ..బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. బీజేపీ తీరును అక్కడి ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని దీంతో ఓటమి భయం ప్రస్తుతం బీజేపీలో నెలకొందన్నారు.
Read More : Ind Vs Nz.. 2nd Test : మూడో రోజు ఆట పూర్తి… విజయానికి 5 వికెట్ల దూరంలో భారత్
ప్రయాగ్ రాజ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో…ఉప ముఖ్యమంత్రి, బీజేపీ లీడర్ కేశవ్ ప్రసాద్ మౌర్య పాల్గొన్నారు. 2017 కంటే ముందు…లుంగీలు ధరించిన వారు వ్యాపారులను బెదిరించే వారని, లుంగీ, టోపీలు ధరించిన వారు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారని వెల్లడించారు. అంతేగాకుండా స్థలాలు కబ్జాలు చేస్తూ..దౌర్జన్యాలకు పాల్పడే వారని ఘాటు కామెంట్స్ చేశారు. అయితే..ప్రస్తుతం బీజేపీ అధికారంలోకి వచ్చాక..అవన్నీ కనిపించడం లేదన్నారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుబట్టింది. ఆ పార్టీకి చెందిన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.