యమ స్పీడ్ : వందే భారత్ ఎక్స్ ప్రెస్ టికెట్ ధరల తగ్గింపు

  • Published By: venkaiahnaidu ,Published On : February 12, 2019 / 03:13 PM IST
యమ స్పీడ్ : వందే భారత్ ఎక్స్ ప్రెస్ టికెట్ ధరల తగ్గింపు

Updated On : February 12, 2019 / 3:13 PM IST

మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశంలో తయారైన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్(ట్రెయిన్-18) ఎక్స్ ప్రెస్ టికెట్ ప్రతిపాదిత ధరలను తగ్గించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి వారణసికి ఏసీ కార్ టికెట్ ధర రూ.1,850 ఉండగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.3,520 చొప్పున ఉంటాయని సోమవారం అధికారులు ప్రకటించిన 24 గంటల్లోపై ఈ ధరలను తగ్గించినట్లు మంగళవారం(ఫిబ్రవరి-12,2019) ప్రకటించారు.

ఏసీ చైర్ కార్ ధర రూ.1,760, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.3,310గా ఉంటుందని మంగళవారం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుగు ప్రయాణంలో చైర్ కార్ టికెట్ ధర రూ.1,700 కాగా ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.3,260గా ఉండనుంది. స్నాక్స్, భోజనవసతితో కలిపి ఈ ధరలను నిర్ణయించారు. శుక్రవారం(ఫిబ్రవరి-15,2019) ప్రధాని మోడీ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జెండా ఊపి ఈ రైలును ప్రారంభించనున్నారు. 16 బోగీలుండే ఈ రైలు గంటకు రూ.180కి.మీ వేగంతో ప్రయాణించనుంది.