రెండో రోజే…ఆగిపోయిన వందే భార‌త్ ఎక్స్ ప్రెస్

  • Published By: venkaiahnaidu ,Published On : February 16, 2019 / 06:44 AM IST
రెండో రోజే…ఆగిపోయిన వందే భార‌త్ ఎక్స్ ప్రెస్

Updated On : February 16, 2019 / 6:44 AM IST

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ణానంతో త‌యారైన సెమీ హైస్పీడ్ రైలు వందే భార‌త్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్ -18) ప్రారంభించిన మ‌రుస‌టి రోజే నిలిచిపోయింది.శుక్ర‌వారం(ఫిబ్ర‌వ‌రి-15,2019)  ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లిన రైలు తిరిగి ఢిల్లీకి వస్తుండగా..ఇవాళ‌(ఫిబ్ర‌వ‌రి-17,2019) ఉదయం మధ్యలోనే ఆగిపోయింది. ఢిల్లీకి 200కి.మీ దూరంలోని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని టుండ్లా సిటీకి 18 కిలోమీట‌ర్ల దూరంలో ఉద‌యం 6గంట‌ల 30నిమిషాల స‌మ‌యంలో పశువులు అడ్డుగా రావ‌డంతో చ‌క్రాల్లో సాంకేతిక లోపం త‌లెత్తింది. దీంతో రైలు ఆపాల్సి వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు.

ఇంజినీర్లు వెంటనే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. మళ్లీ 8:30గంటలకు రైలు దిల్లీకి బయలుదేరింది. అయితే ఇది షెడ్యూల్డ్ క‌మ‌ర్షియ‌ల్ ర‌న్ కాదు, ఆదివారం(ఫిబ్ర‌వ‌రి-17,2019)నుంచి క‌మ‌ర్షియ‌ల్ ఆప‌రేష‌న్స్ ప్రారంభ‌మ‌వుతాయని రైల్వే మంత్రి పియూష్ గోయ‌ల్ తెలిపారు.   గంటకు 180కి.మీ వేగంలో ప్రయాణించగల సామర్థ్యమున్న ఈ రైలు శుక్రవారం 130కి.మీ వేగాన్ని అందుకున్నట్లు అధికారులు తెలిపారు