ఆసుపత్రిలోని ఐసీయూలో రెండు జంటల పెళ్లిళ్లు.. వీడియో చూస్తారా?

Wedding in ICU: ఛాతీలో ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ పెళ్లికి కొన్ని రోజుల ముందే ఐసీయూలో చేరాడు.

ఆసుపత్రిలోని ఐసీయూలో రెండు జంటల పెళ్లిళ్లు.. వీడియో చూస్తారా?

ప్రాణానికి ప్రాణంగా పెంచిన ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లను చూసే కన్నుమూయాలనుకున్నాడు ఆ తండ్రి. పెళ్లికి ముహర్తం కూడా పెట్టాడు. అయితే, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఈ కోరిక తీరకుండానే మృత్యు ఒడికి చేరతానేమోనని భయపడ్డాడు.

ఛాతీలో ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ పెళ్లికి కొన్ని రోజుల ముందే ఐసీయూలో చేరాడు. చికిత్స పొందుతున్నప్పటికీ కూతుళ్ల పెళ్లిళ్ల గురించే ఆలోచించాడు. అయితే, తండ్రి కోరికను నెరవేర్చడానికి ఆ ఇద్దరు కూతుళ్లు ఆ ఐసీయూలోనే ఆయన ముందే పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వైద్యులకు చెప్పారు.

వారు ఒప్పుకోవడంతో ఐసీయూలోనే రెండు జంటల పెళ్లి జరిగింది. ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఎరా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట మహమ్మద్ ఇక్బాల్ (51) పెద్ద కుమార్తె పెళ్లి ఐసీయూలో జరిగింది.

ఆ తర్వాతి రోజే రెండో కుమార్తె పెళ్లి కూడా ఐసీయూలోనే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాను ఐసీయూలో ఉన్నప్పటికీ తన ముందే కూతుళ్ల పెట్టి జరగడంతో ఆ తండ్రి మురిసిపోయాడు.

Also Read : చైల్డ్ ఆర్టిస్ట్ యానీ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..? హీరోయిన్‌లా మెరిసిపోతూ..