Uber Driver Molests Woman: ఉబర్ డ్రైవర్ వేధింపులు.. స్పందించని ఉబర్ యాజమాన్యం.. నెటిజన్ల సాయం కోరిన మహిళ
మహిళలు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు క్యాబ్స్ ఆశ్రయించినప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓ సంఘటన హెచ్చరిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మనాలి గుప్తకు ఎదురైన చేదు అనుభవం చదవండి.

Uber driver harasses woman
Woman Molested By An Uber Driver : ఉబర్ డ్రైవర్ నుంచి వేధింపులు ఎదుర్కొన్న ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఉబర్ యాజమాన్యానికి కంప్లైంట్ చేసినా స్పందించకపోవడంతో తనకు సాయం చేయమంటూ నెటిజన్లను రిక్వెస్ట్ చేసింది.
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మనాలి గుప్తా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌కి చెందిన మనాలి గుప్తా తన కుమార్తెను స్కూల్ నుండి తీసుకురావడానికి ఉబర్‌ను ఆశ్రయించారు. ఉబర్ ఎక్కిన తర్వాత ఆమె ఫోన్ మాట్లాడుతుండగా డ్రైవర్ ఒక్కసారిగా ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడట. ప్రతిఘటించబోయిన ఆమెను ధూషించాడట. కారు ఆపమని అరుస్తున్నా కారును మరింత వేగంగా నడిపాడట. కదులుతున్న కారు నుండి దూకడం తప్ప వేరే మార్గం లేక మనాలి కారునుంచి దూకేసారట. డ్రైవర్ కారుతో పాటు పరారయ్యాడట.
Uber CEO: డ్రైవర్‌గా పనిచేశా.. జరిమానా కట్టాల్సివచ్చింది: ఉబర్ సీఈవో
ఈ ఘటనపై ఉబర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా తనకు స్పందన రాలేదని మనాలి తను షేర్ చేసిన వీడియోలో చెప్పారు. ఉబర్ డ్రైవర్ పేరు శ్యామ్ సుందర్ అని కారు వివరాలను కూడా మనాలి వీడియోలో పేర్కొన్నారు. ఈ ఘటనపై తనకు సపోర్ట్ చేయమంటూ మనాలి నెటిజన్లను రిక్వెస్ట్ చేసారు. వీడియో వైరల్ కావడంతో మనాలికి మద్దతు పలికిన నెటిజన్లు ఉబర్‌ను నిషేధించమంటూ ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై ఉబెర్ స్పందించాల్సి ఉంది. మరోవైపు ప్రైవేట్ క్యాబ్స్ ఆశ్రయించినప్పుడు మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
View this post on Instagram