viral video : డ్యాన్స్ ఫ్లోర్లుగా ఫుట్ పాత్‌లు.. వర్షంలో ‘జబ్ వి మెట్’ మూవీలోని ‘తుమ్ సే హీ’ పాట రిక్రియేట్ చేసిన జంట
వైరల్ అవ్వడానికి జనాలు ఏమైనా చేస్తున్నారు. ఓ వైపు మెట్రోల్లో రీళ్లు, వీడియోలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక పాత పాటలు రిక్రియేట్ చేస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవలే వర్షంలో ‘రిమ్‌జిమ్ గిరే సావన్’ పాటను వృద్ధ జంట ఫ్రేమ్ బై ఫ్రేమ్ రిక్రీయేట్ చేస్తే మరో యువ జంట 'తుమ్ సే హీ' అని పాడుకున్నారు.

viral video
viral video : మెట్రోలు అయిపోయాయి.. ఇక జనాలు ఫుట్ పాత్‌లు, రోడ్లు డ్యాన్స్ ఫ్లోర్లులాగ వాడేసుకుంటున్నారు. భారీ వర్షంలో తడుస్తూ “తుమ్ సే హీ” అంటూ ఓ జంట పాట పాడుకున్నారు. ‘జబ్ వి మెట్’ సినిమాలో పాటను రిక్రియేట్ చేసారు. క్యూట్ నెస్ తగ్గిందని నెటిజన్లు పెదవి విరిచారు.
@theLostFirsbee అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ‘జబ్ వి మెట్’ సినిమా గుర్తుందా?.. షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా నటించారు. అందులోని ‘తుమ్ సే హీ’ రొమాంటిక్ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటను ఓ జంట వర్షంలో మళ్లీ రిక్రియేట్ చేసారు. అయితే జంట చేసిన డ్యాన్స్ చూసి నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. అయితే ఓవైపు భారీ వర్షం, రోడ్డుపై వెళ్తున్న వాహనాలు.. వారినే గమనిస్తున్న జనం అయినా ఇవేమీ పట్టించుకోకుండా డేర్‌గా ఆ జంట వేసిన స్టెప్పులు చూసి మెచ్చుకోకుండా ఉండలేం.
Mumbai : ముంబయి లోకల్ ట్రైన్‌లో ‘కాంత లగా’ పాట పాడుతూ డ్యాన్స్ చేసిన ప్రయాణికులు
‘ఫుట్ పాత్‌లు భారతదేశంలో డ్యాన్స్ ఫ్లోర్లు’ అని ఒకరు.. ‘పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసేవరకూ అంతా బాగానే ఉంటుందని’ మరొకరు వరుసగా కామెంట్లు చేశారు. సినిమాల్లో జంటలు డ్యూయెట్లు పాడుకోవడాలు చూసాం. ఇకపై రియల్ లైఫ్‌లో అందరూ రోడ్లపై పాటలు పాడుతుంటే చూడాలేమో అంటూ నెటిజన్లు సెటైర్లు వేశారు.
This Or Nothing ??❤️
Najar na lge ? pic.twitter.com/OkG6S5dEjG— Anu. (@theLostFirsbee) July 7, 2023