Uttar Pradesh : ప్రభుత్వ సొమ్ము కోసం నకిలీ పెళ్లిళ్లు.. ఎలా గుర్తించారంటే?

ఎదురుగా వరుడు లేడు.. వధువులు తమ మెడలో తామే వర మాల వేసుకున్నారు. ఇదేం పెళ్లి? అంటారా.. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ వివాహ పథకంలో జరిగిన నకిలీ పెళ్లిళ్ల భాగోతం.

Uttar Pradesh : ప్రభుత్వ సొమ్ము కోసం నకిలీ పెళ్లిళ్లు.. ఎలా గుర్తించారంటే?

Uttar Pradesh

Updated On : February 4, 2024 / 11:26 AM IST

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్  ప్రభుత్వ వివాహ పథకంలో భారీ మోసం వెలుగు చూసింది. సామూహిక వివాహ వేడుకలో నకిలీ పెళ్లిళ్లు జరిపించిన ఇద్దరు అధికారులతో సహా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Uttar Pradesh : పొడవైన జుట్టుతో ఉత్తరప్రదేశ్ మహిళ గిన్నిస్ రికార్డ్

పేదల కోసం ప్రభుత్వం చేపట్టే కొన్ని పథకాలు అధికారులు దారి మళ్లించిన వార్తలు విన్నాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో పేదింటి యువతీ యువకుల కోసం ప్రభుత్వం చేపట్టిన వివాహ పథకంలో భారీ మోసం చోటు చేసుకుంది. నకిలీ వధూవరులతో వివాహ తంతు పూర్తి చేసి ప్రభుత్వ సొమ్ము కాజేసేందుకు ప్రయత్నించిన అధికారుల భాగోతం బయటపడింది. బలియా జిల్లాలో జనవరి 25న జరిగిన కమ్యూనిటీ వెడ్డింగ్‌లో దాదాపు 568 జంటలు కనిపించారు. అయితే వారిలో కొందరిని వధూవరులుగా నటించడానికి ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వరుడు లేకుండానే వందలాదిమంది యువతులు తమ మెడలో తామే వరమాలలు వేసుకుంటూ వీడియోలో కనిపించారు. దీంతో అంతా అవాక్కయ్యారు. ఇలా నటించేందుకు వచ్చిన మగ, ఆడవారికి రూ.500 ల నుండి, రూ.2000 చెల్లిస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

Vijay : పార్టీ పేరు ప్రకటించిన హీరో విజయ్

కాగా ఈ ప్రభుత్వ ఈవెంట్‌కు బీజేపీ ఎమ్మెల్యే కేత్కీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఘటనపై తనకు అనుమానాలున్నాయని విచారణ జరుగుతోందని వెల్లడించారు. యూపీ ప్రభుత్వం ఈ వివాహ స్కీమ్ క్రింద రూ.51,000 చెల్లిస్తోంది. అమ్మాయికి రూ.35,000, పెళ్లి సామాగ్రి కోసం రూ.10,000, వేడుక ఖర్చుల కోసం రూ.6000 అందిస్తోంది.