Viral Ad: వరుడు కావలెను.. 30ఏళ్ల యువతికి పాతికేళ్ల కుర్రాడు కావాలట!
అమ్మాయి కంటే అబ్బాయి వయస్సు ఎక్కువ ఉండాలి. అబ్బాయికి అమ్మాయి కట్నం ఇవ్వాలి. ఆస్తులు, అంతస్తులు, అందంలో అబ్బాయి కంటే అమ్మాయి మెరుగ్గా ఉండాలి అనే ఫార్ములా.. సంప్రదాయం పేరు ఏదైనా మన భారతీయ సమాజంలో ఇందుకు రివర్స్‌లో జరగడం మాత్రం కష్టమే.

Searching For Husband
Searching for Husband: అమ్మాయి కంటే అబ్బాయి వయస్సు ఎక్కువ ఉండాలి. అబ్బాయికి అమ్మాయి కట్నం ఇవ్వాలి. ఆస్తులు, అంతస్తులు, అందంలో అబ్బాయి కంటే అమ్మాయి మెరుగ్గా ఉండాలి అనే ఫార్ములా.. సంప్రదాయం పేరు ఏదైనా మన భారతీయ సమాజంలో ఇందుకు రివర్స్‌లో జరగడం మాత్రం కష్టమే. కానీ, రివర్స్‌లోనే జరగాలి అని పట్టుబట్టే కొందరు స్త్రీవాదులు(ఫెమినిస్ట్) కూడా ఉన్నారు. అటువంటి కట్టుబాట్ల సంకెళ్లు తెంచుకుని కనిపించిన ఓ అడ్వర్టైజ్‌మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“వరుడు కావలెను: 30ఏళ్ల ఫెమినిస్ట్, చెవి-ముక్కు పోగులు, జట్టు పొట్టిగా ఉన్న విద్యావంతురాలు, క్యాపిటలిజానికి వ్యతిరేకంగా సామాజిక సంస్థలో పని చేస్తున్న మహిళకు అందమైన, చక్కటి శరీర నిర్మాణం కలిగిన 25నుంచి 28ఏళ్ళ వయసు గల యువకుడు వరుడుగా కావలెను. వ్యాపారం, బంగళా, కనీసం 20 ఎకరాల ఫార్మ్ హౌజ్ ఉండి ఏకైక కుమారుడైన వ్యక్తి, వంట చేయడం బాగా వచ్చి ఉండి, ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి. మరో కండీషన్ ఏంటి అంటే, ఆ వ్యక్తి తిన్న తర్వాత తేన్పులు, పడుకున్నప్పుడు గురక పెట్టకూడదు.”
ఇది ఓ ఇంగ్లీషు పత్రికలో పెళ్లి సంబంధాలకు సంబంధించిన ప్రకటనల మధ్యలో వచ్చిన ఓ ప్రకటన. మ్యాట్రిమోనియల్ ప్రకటనల్లో ఎప్పుడూ కూడా జెండర్, కులం, ఆస్తి వివరాలు ఎక్కువగా కనిపిస్తాయి. అప్పుడప్పుడూ శారీరక అందం, రంగు గురించి రాసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రకటన చూస్తుంటే మాత్రం కచ్చితంగా వరుడు కోసం ఇచ్చిన ప్రకటన మాత్రం కాదని ఇట్టే తెలిసిపోతుంది. కోటీశ్వరుడైన, అందమైన, వంట తెలిసిన కుర్రాడే కవాలని మళ్లీ కండీషన్స్ అప్లై అంటూ ఛమత్కారంగా ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్ అని పూర్తిగా అర్థం అవుతోంది. అందుకే ఈ ప్రకటన వెంటనే వైరల్ అయిపోయింది. సెలబ్రిటీలు సైతం ఈ ప్రకటనను సరదాగా పోస్ట్ చేస్తున్నారు.
అయితే అసలు విషయానికి వస్తే, ఆ ప్రకటన ఇచ్చింది ఆమె సోదరుడే.. సోదరికి పుట్టినరోజు కానుకగా అన్న చెల్లి కోసం, ఆమె స్నేహితురాలితో కలిసి ఇచ్చిన సరదా ప్రకటన ఇది. దీనిపై ఓ ఇంటర్నేషనల్ మీడియాతో సదరు ఫెమినిస్ట్ మాట్లాడుతూ.. అందరికీ అందమైన, డబ్బున్న, జీవితంలో స్థిరపడిన వరుడే కావాలి. కానీ, అదే స్పష్టంగా, బహిరంగంగా ప్రకటిస్తే మాత్రం తిట్టిపోస్తారు. ఇప్పుడు జరుగుతుంది కూడా ఇదే అంటూ ఆమె తన వెర్షన్‌ను వినిపించింది.
మగవాళ్లు మాత్రం తెల్లగా, సన్నగా, అందంగా ఉండే అమ్మాయి కావాలని ప్రకటనలు ఇవ్వొచ్చు. వాళ్ల ఆస్తిపాస్తుల గురించి గొప్పలు చెప్పుకోవచ్చు. అమ్మాయిలు మాత్రం అలా చెయ్యకూడదా? అంటూ తన ఫెమినిజాన్ని వ్యక్తం చేసింది యువతి.
??? someone out there is waiting for you ? https://t.co/tpv5IqcjU2
— TheRichaChadha (@RichaChadha) June 15, 2021