Video: ఈ ఆటో డ్రైవర్ పాడిన ఈ పాట ఎందుకు ఇంత వైరల్ అవుతుందో తెలుసా? మీరూ వింటారా?
ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది భయ్యా..?

Auto driver sings Coldplay song
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ ఆటో డ్రైవర్ కోల్డ్‌ప్లే సాంగ్‌ను పాడి అబ్బురపర్చాడు. అతడు పాట పాడుతుండగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అతడు ట్యూన్‌లను హమ్మింగ్ చేసిన తీరు మన దేశంలో ఏ ఇతర గాయకుడికీ సాధ్యం కాదని కొందరు నెటిజన్లు అంటున్నారు.
అహ్మదాబాద్స్‌లో ఇటీవల కోల్డ్‌ప్లే కచేరీలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఆటోడ్రైవర్ కోల్డ్‌ప్లే సాంగ్ పాడడం గమనార్హం. ఆ కచేరీల ప్రభావంతోనే ఈ డ్రైవర్ ఈ పాటను నేర్చుకున్నాడో ఏమోగానీ టాలెంట్ ఎవరి సొత్తూ కాదని నిరూపిస్తున్నాడు.
ఆ ఆటోడ్రైవర్ వీడియోను నవేందు అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేస్తూ.. “ఈ ఆటో డ్రైవర్ అహ్మదాబాద్‌లో కోల్డ్‌ప్లే ట్యూన్‌లను పాడుతున్నాడు. అతడిని కోల్డ్‌ప్లే సంస్థవారు వారి తదుపరి కచేరీకి ఆహ్వానించాలి. అతడి ఆటోలోనే వేదికపైకి కోల్డ్‌ప్లే సంస్థవాళ్లు రావాలి” అని పేర్కొన్నాడు. ఆటో డ్రైవర్ పాట పాడుకుంటూ డ్రైవింగ్ చేస్తూ వేరే వాహనంలో నుంచి నవేందు ఈ వీడియోను తీయడం గమనార్హం. తనను వీడియో తీస్తున్నారని తెలుసుకున్న ఆ ఆటోడ్రైవర్ మరింత గొంతు పెంచి పాటను పాడాడు.
బ్రిటిష్ రాక్ బ్యాండ్ “కోల్డ్‌ప్లే” తమ మ్యూజిక్ ఆఫ్ ది గోరేస్ వరల్డ్ టూర్‌లో భాగంగా గత నెలలో ముంబైలో 3 ప్రదర్శనలను ఇచ్చింది. గత నెల 25, 26 తేదీల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రెండు బ్యాక్ టు బ్యాక్ ప్రదర్శనలు జరిగాయి.
View this post on Instagram