Bihar BJP MLA : పటాకులు కాల్చి బొక్కబోర్లా పడ్డ బీజేపీ ఎమ్మెల్యే
పటాకులు కాల్చి బొక్కబోర్లా పడ్డారు బీజేపీ ఎమ్మెల్యే.

bjp mla runs away from cracker falls flat on his face
bjp mla runs away from cracker falls flat on his face : దీపావళి అంటే పటాకుల పండుగ. పటాకులు కాల్చటం అంటే చాలామంది భయపడుతుంటారు. కానీ తమకేమీ భయం లేదు..ధైర్యంగా కాల్చేస్తాం అంటూ భీరాలు పలుకుతారు. కానీ ఆ తరువాతే చూడాలి జరిగేదేమిటో..ఇలా పటాకులకు ఇలా నిప్పు అంటించి అలా పక్కకెళ్లి దాక్కుంటారు. లేదా దౌడు తీస్తారు. అదే జరిగింది ఓ ఎమ్మెల్యే విషయంలో. పటాకుకు నిప్పు అంటించి పాపం అక్కడినుంచి దూరంగా వెళ్లిపోదామని యత్నించిన ఓ బీజేపీ ఎమ్మెల్యేకు మొహం పగిలిపోయింది. పటాకుకు నిప్పు అంటించి అక్కడనుంచి దూరంగా వెళ్లిపోదామని పరుగెత్తే సమయం పాపం ఎమ్మెల్యే బొక్కబోర్లా పడ్డాడు. మొహం ధామ్మంటూ నేలకు తగ్గి దిమ్మ తిరిగిపోయింది…దీనికిసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్అవుతోంది.
వినయ్ కుమార్ సింగ్ బీహార్ లోని సోనేపూర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే. రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా. తన నియోజకవర్గ కేంద్రమైన సోనేపూర్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతున్న క్రమంలో మ్యాచ్‌ల ప్రారంభోత్సవానికి వినయ్ కుమార్ సింగ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆటలను ప్రారంభించిన ఎమ్మెల్యే.. ఓ పటాకీ కాల్చారు. దానికి అగ్గిపుల్ల పుట్టించి.. వెంటనే లేచి పరుగు పెట్టారు. ఈ క్రమంలో పాపం పట్టుతప్పి బొక్కబోర్ల పడిపోయారు. దీంతో ఆయన మొహం ధామ్మంటూ నేలకు గుద్దుకుంది. దెబ్బకూడా బాగానేతగ్గినట్లుగా తెలుస్తోంది. సారు కిందపడి లేచిన తర్వాత ధన్ మంటూ శబ్ధం చేస్తే ఆ బాంబు పేలిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
बिहार के सोनपुर से पूर्व विधायक विनय सिंह पटाखा जलाकर भागते हुए मैदान में औंधे मुंह गिर पड़े,वीडियो सोशल मीडिया पर वायरल.
#ViralVideo #Bihar pic.twitter.com/ppSL09EksQ— Aanchal Dubey (@AanchalDubey21) October 18, 2022