కాపాడండ్రోయ్.. కుండపోత వర్షం.. రోడ్డుపై వరదనీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. చివరికి ఎలా కాపాడారో చూడండి.. వీడియో వైరల్

రాజస్థాన్ రాష్ట్రంలో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం అజ్మేర్‌‌లో గంటపాటు కుండపోత వర్షం కురిసింది.

కాపాడండ్రోయ్.. కుండపోత వర్షం.. రోడ్డుపై వరదనీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. చివరికి ఎలా కాపాడారో చూడండి.. వీడియో వైరల్

Rajasthan

Updated On : July 19, 2025 / 2:33 PM IST

Video viral: రాజస్థాన్ రాష్ట్రంలో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం అజ్మేర్‌‌లో గంటపాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ నదులను తలపించాయి. భారీ వర్షం కారణంగా ఖ్వాజా గరీబ్ నవాబ్ దర్గా ప్రాంతాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఇరుకు సందుల్లోకి ఆకస్మికంగా వరదనీరు రావడంతో ఓ వ్యక్తి ఆ నీటిలో కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దర్గా వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో ఓ యాత్రికుడు రోడ్డును దాటే ప్రయత్నం చేశాడు. నీటి ఉధృతికి పట్టుతప్పి కింద పడిపోయాడు. అతని చేతిలో వాటర్ బాటిల్ ఉంది. లేచి వరద నీటిలో నుంచి బయటకు వచ్చే క్రమంలో వరద ప్రవాహానికి నిలువలేక ఆ వ్యక్తి కొట్టుకుపోసాగాడు. రోడ్డుపక్కన షాపుల వారు, స్థానికులు అతనికి సహాయం చేసేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండాపోయింది. దీంతో సదరు వ్యక్తి కొద్దిదూరం నీటిలో కొట్టుకుపోవటం వీడియోలో కనిపించింది.

స్థానికులు కేకలు వేయడంతో రోడ్డుపక్కనే హోటల్ సిబ్బంది అప్రమత్తమై అతని చేయి పట్టుకొని లాగారు. దీంతో ఆ వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.