Video: వామ్మో.. ఘోర ప్రమాదానికి కారణమైన బర్రె.. 12 వాహనాలు ఒకదాన్నొకటి ఢీ

పలు కార్లు, ఓ అంబులెన్స్, రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానినొకటి ఢీ కొట్టుకున్నాయని చెప్పారు.

Video: వామ్మో.. ఘోర ప్రమాదానికి కారణమైన బర్రె.. 12 వాహనాలు ఒకదాన్నొకటి ఢీ

nagpur

Updated On : April 8, 2024 / 3:37 PM IST

ఎల్లప్పుడూ రద్దీగా ఉండే రోడ్డుపై ఘోర ప్రమాదానికి కారణమైంది ఓ బర్రె. దాదాపు 12 వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొట్టుకున్నాయి. ఆరుగురికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా మంకాపూర్ స్క్వేర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి జరిగిన ఈ ప్రమాదం గురించి పోలీసులు వివరాలు తెలిపారు. రోడ్డుపైకి ఓ బర్రె దూసుకురావడంతో కొన్ని కార్లు ఒక్కసారిగా బ్రేక్ వేశాయని తెలిపారు. దీంతో పలు కార్లు, ఓ అంబులెన్స్, రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానినొకటి ఢీ కొట్టుకున్నాయని చెప్పారు.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాహుల్ మద్నే దీనిపై విచారణ చేపట్టారు. ఓ కంటైనర్ ట్రక్ పలు వాహనాలపైకి దూసుకెళ్లడంతో అవి ధ్వంసమయ్యాయి. ఆ ట్రక్ అతి వేగంగా వచ్చినట్లు కొందరు చెప్పారు. ధ్వంసమైన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించడానికి చాలా సమయం పట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Also Read: విప్రోకు నూతన సీఈవోగా శ్రీనివాస్ పల్లియా.. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటంటే?