Viral Video : ఛీ..ఛీ.. వీడసలు మనిషేనా? ఉమ్మి వేసి రోటీలు తయారీ.. వీడియో వైరల్
Viral Video: రోటీలు చేస్తూ మధ్య మధ్యలో పిండిపై ఉమ్మి వేస్తాడు. ఆ తర్వాత రొట్టెలు కాలుస్తాడు. వాటినే హోటల్ లోని కస్టమర్లకు సర్వ్ చేస్తారు.

Viral Video(Photo : Google)
Viral Video : ఓ హోటల్ లో పని చేసే వ్యక్తి నీచానికి దిగజారాడు. కస్టమర్లు తినే ఆహారంలో ఉమ్మి వేశాడు. ఉమ్మి వేసి రోటీలు తయారు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పత్ జిల్లా రతౌల్ పట్టణంలోని అలీ రహ్మత్ హోటల్ లో జరిగింది. వీడియోని గమనిస్తే.. హోటల్ లో ఓ వ్యక్తి చాలా వేగంగా రోటీలు తయారు చేస్తుంటాడు. రోటీలు చేస్తూ మధ్య మధ్యలో పిండిపై ఉమ్మి వేస్తాడు. ఆ తర్వాత రొట్టెలు కాలుస్తాడు. వాటినే హోటల్ లోని కస్టమర్లకు సర్వ్ చేస్తారు. పాపం ఈ విషయం తెలియని కస్టమర్లు వాటిని అలాగే తినేస్తున్నారు.
అయితే, ఆ వ్యక్తి ఉమ్మి వేసి రోటీలు చేస్తుండగా.. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఆ ఘోరాన్ని వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతే, ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.(Viral Video)
బాగ్‌పత్‌లోని ఖేక్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని రతౌల్‌లోని హోటల్ లో ఈ ఘోరం జరిగింది. ఉమ్మితో రోటీని తయారు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది పోలీసుల వరకు చేరింది. దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని ఖేక్రా పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు.
ఈ వీడియో అందరినీ షాక్ కి గురి చేసింది. ఆ వ్యక్తి తీరు చర్చనీయాంశంగా మారింది. ఛీ..ఛీ.. మరీ ఇంత దారుణమా? వాడసలు మనిషేనా? అని జనాలు తిట్టిపోస్తున్నారు. ఉమ్మి వేసిన ఆహారం కస్టమర్లకు వడ్డిస్తున్నారా? అని ఆ హోటల్ యాజమాన్యంపై సీరియస్ అవుతున్నారు. వాడలా చేస్తుంటే హోటల్ యాజమాన్యం ఏం చేస్తోంది అని నిలదీస్తున్నారు.(Viral Video)
తినే ఆహారంలో ఉమ్మి వేసిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో ఆధారంగా కొందరు స్థానికుల కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఖేక్రా ప్రాంతంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.
Adulterated Ice Creams : మీ పిల్లలకు ఐస్ క్రీమ్స్ కొనిస్తున్నారా? వారి ప్రాణాలకే ప్రమాదం..
సాధారణంగా కొందరు బయటి ఫుడ్ తినడానికి బాగా ఇష్టపడతారు. వీకెండ్స్ లో, అకేషన్స్ లో ఫ్యామిలీతో కలిసి సరదాగా హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్ సైడ్ ఫుడ్ తినేందుకు వెళ్తుంటారు. అయితే, ఈ వీడియో చూశాక.. బయటి ఫుడ్ తినాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. బయటి ఫుడ్ అంటే.. బాబోయ్ అంటున్నారు. అయితే, అన్ని చోట్లా ఇలాంటి వాళ్లు ఉండరని, ఇలాంటి పరిస్థితి ఉండదని మరికొందరు చెబుతున్నారు. ఎక్కడో ఒక చోట అలా జరిగి ఉండొచ్చు. అంతమాత్రాన అన్ని చోట్ల ఇలానే ఉంటుందని అనుకోవడం పొరపాటే అంటున్నారు. కాబట్టి ఎలాంటి భయాలు లేకుండా బయటి ఫుడ్ తినొచ్చని చెబుతున్నారు.
रटौल नगर पंचायत के एक ढाबे पर थूक लगाकर रोटी बनाने का वीडियो वायरल । @adgzonemeerut @baghpatpolice @news18_rajan @Uppolice @ANINewsUP @BagpatDm @baghpat_sp pic.twitter.com/eL8sV58V4r
— sachin tyagi (@sachintyagikk) April 14, 2023