రైఫిల్ పట్టుకుని షూట్ చేసిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : February 5, 2020 / 05:45 PM IST
రైఫిల్ పట్టుకుని షూట్ చేసిన మోడీ

Updated On : February 5, 2020 / 5:45 PM IST

ఉత్తరప్రదేశ్ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గన్ పట్టుకున్నారు. గురిచూసి కాల్చారు. మోడీ గన్ పట్టుకుని గురిపెడుతుంటే పక్కనే నిలబడి ఆశక్తిగా చూశారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. అయితే ప్రధాని మోడీ గన్ పట్టుకుని కాల్చింది ఏ వ్యక్తినో,జంతువునో కాదు కేవలం తనలోని షూటింగ్ నైపుణ్యాలను వర్చువల్ ఫైరింగ్ రేంజ్‌లో పరీక్షించారు. మోడీ గన్ పట్టుకుని గురిపెడుతుంటే పక్కనే నిలబడి ఆశక్తిగా చూశారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.

	దావ.jpg

బుధవారం(ఫిబ్రవరి-5,2020)ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఐదు రోజుల పాటు జరిగే ఢిఫెన్స్ ఎక్స్ పో 2020ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ లాంఛ్ చేశారు. మెగా డిఫెన్స్ ఈవెంట్ యొక్క పదకొండవ ఎడిషన్ లక్నోలో “ఇండియా: ది ఎమర్జింగ్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్” అనే థీమ్‌తో జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని అసల్ట్(దాడి) రైఫిల్ ను పట్టుకుని తన షూటింగ్ నైపుణ్యాలను వర్చువల్ ఫైరింగ్ రేంజ్‌లో పరీక్షించారు. యూపీ సీఎం యోగి మోడీ పక్కనే నిలబడి ఆశక్తిగా గమనించారు. ఢిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ కూడా గన్ పట్టుకుని పరీక్షించారు. 

	pm.jpg

రాబోయే ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఎగుమతులను భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ అన్నారు. భారత్ కోసం,ప్రపంచం కోసం మన మంత్రం మేక్ ఇన్ ఇండియా అని అన్నారు. 2014లో భారత్ నుంచి రక్షణ పరికరాల ఎగుమతుల విలువ 2వేల కోట్లు అని తెలిపారు. గడిచిన రెండేళ్లలో ఇది 17వేల కోట్లకు చేరిందనన్నారు. రాబోయే ఐదేళ్లలో మన లక్ష్యం 5 బిలియన్ డాలర్ల(35వేల కోట్లు) రక్షణ పరికరాల ఎగుమతులు అని మోడీ తెలిపారు. 

	RAJNATH.JPG

భారతదేశంలో రక్షణ తయారీలో అపరిమిత అవకాశాలు ఉన్నాయని ప్రధాని అన్నారు. టాలెంట్,టెక్నాలజీ,ఇన్నోవేషన్,ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అనుకూలమైన పాలసీ,విదేశీ పెట్టుబడుల రక్షణ కూడా మన దేశంలో ఉన్నాయన్నారు. ఇక్కడ డిమాండ్, ప్రజాస్వామ్యం మరియు నిర్ణయాత్మకత కూడా ఉందని ప్రధాని తెలిపారు. ఐదు రోజులు జరిగే ఈ ఢిఫెన్స్ ఎక్స్ పోలో 40 కి పైగా దేశాల మంత్రులు పాల్గొంటున్నారని, భారత్‌తో రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దేశాలకు ఇది ఒక ముఖ్యమైన అవకాశమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.