రాగల 48 గంటల్లో పలు రాష్ట్రాల్లో వర్షాలు

  • Published By: chvmurthy ,Published On : November 26, 2019 / 03:25 AM IST
రాగల 48 గంటల్లో పలు రాష్ట్రాల్లో వర్షాలు

Updated On : November 26, 2019 / 3:25 AM IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళ, బుధవారాల్లో  వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ తెలిపింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

వాయు కాలుష్యం వల్ల శ్వాసకోస సమస్యలతో అల్లాడుతున్న దేశ రాజధాని  ఢిల్లీ వాసులకు ఈ వర్షం స్వల్ప ఊరట లభించనుంది. పంటలకు కూడా ఈ వర్షాలు అనుకూలమేనని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ పీకే సిద్ధూ చెప్పారు.

ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చంఢీఘడ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో రెండురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్లవర్షంతోపాటు పిడుగులు పడే ప్రమాదముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.