Wedding Postpone: పెళ్లి వాయిదా.. టవరెక్కిన యువకుడు

కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా శుభకార్యాలు నిలిచిపోయాయి. కొద్దీ మందితోనే వేడుకలు జరుపుకోవాలని అధికారులు ఆదేశించడంతో చాలామంది వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ యువకుడి పెళ్లిని లాక్ డౌన్ కారణంగా వాయిదా వేశారు తల్లిండ్రులు.. దీంతో అతడు మొబైల్ టవర్ ఎక్కి కూర్చున్నాడు

Wedding Postpone: పెళ్లి వాయిదా.. టవరెక్కిన యువకుడు

Wedding Postpone

Updated On : June 15, 2021 / 11:14 AM IST

Wedding Postpone: కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా శుభకార్యాలు నిలిచిపోయాయి. కొద్దీ మందితోనే వేడుకలు జరుపుకోవాలని అధికారులు ఆదేశించడంతో చాలామంది వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ యువకుడి పెళ్లిని లాక్ డౌన్ కారణంగా వాయిదా వేశారు తల్లిండ్రులు.. దీంతో అతడు మొబైల్ టవర్ ఎక్కి కూర్చున్నాడు.

ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం హొసపేటె తాలూకాలోని మరియమ్మనహళ్లిలో చోటుచేసుకుంది. మరియమ్మనహళ్లికి చెందిన చిరంజీవి గోసంగి (23) ఓ యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి. లాక్ డౌన్ కారణంగా పెళ్లి ఇప్పుడు జరపడం కష్టమని వాయిదా వేశారు. కుటుంబ సభ్యులు పెళ్లి వాయిదా వేయడం చిరంజీవికి నచ్చలేదు.

దీంతో గ్రామంలోని మొబైల్‌ టవర్‌ ఎక్కి కూర్చున్నాడు. పెళ్లి చేస్తారా లేదంటే దూకమంటారా అంటూ గట్టిగ కేకలు వేశారు. విషయం తెలియడంతో గ్రామంలోని ప్రజలంతా టవర్ దగ్గర మకాం వేశారు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న సీఐ వసంత, ఎస్‌ఐ మీనాక్షి, యువకుడికి నచ్చజెప్పి కిందకు దించారు. దీంతో కథ సుకాంతమైంది.