బెంగాల్‌లో కనిపించిన రెండు తలల పాము: పాలు పోసిన స్థానికులు

రెండు తలల పాము గురించి వింటుంటాం. ఇవి చాలా అరుదుగాకనిపించే రెండు తలల పాము పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని బెల్డా అటవీ ప్రాంతంలోని ఎకరుఖి గ్రామంలో కనిపించింది. ఎకరుఖి గ్రామస్థులు జగల్ అనే ప్రాంతం వైపు వెళుతున్నప్పుడు..ఈ రెండు తలల పామును చూశారు..వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ వైబ్ టీమ్ పాము ఉన్న ప్రాంతానికి చేరుకుంది.
ఈ వార్త ఆనోటా ఈ నోటా..చుట్టు పక్కల గ్రామస్తులకు తెలిసింది. రెండు తలల పాముని చూడటానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. కొంతమంది ఈ రెండు తలల పాముకి ఓ పళ్లెంలో పాలు పోసారు. చాలా అరుదుగా ఇటువంటి పాములు ఉంటాయని తెలిపాన అధికారులు ఆ పామును తమ సంరక్షణలో ఉంచుకున్నారు.
West Bengal: A two-headed snake found in the Ekarukhi village of Belda forest range. (10.12.19) pic.twitter.com/jLD4mPWhv8
— ANI (@ANI) December 10, 2019