Viksit Bharat: 2047 నాటికి వికసిత్ భారత్.. ఎంపీలు, శాసనసభ్యుల పాత్ర ఏంటి?

దేశంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధికి కేంద్రం-రాష్ట్రాల మధ్య మెరుగైన సమన్వయం, సంస్థల మధ్య ఐక్యత చాలా అవసరమన్నారు. పాలసీల అమలులో శాసనసభ్యుల పాత్ర మరింత బలంగా ఉండాలని ఆయన సూచించారు.

Viksit Bharat: 2047 నాటికి వికసిత్ భారత్.. ఎంపీలు, శాసనసభ్యుల పాత్ర ఏంటి?

PM Modi Representative Image (Image Credit To Original Source)

Updated On : January 25, 2026 / 6:07 PM IST
  • వికసిత్ భారత్ @2047 పై ఢిల్లీలో తొలి వర్క్‌షాప్
  • పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, విధాన నిపుణులు
  • పాలసీల అమలులో శాసనసభ్యుల పాత్ర మరింత బలంగా ఉండాలని సూచన

 

Viksit Bharat: దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు డా. వి. అనంత నాగేశ్వరన్ అన్నారు. నేషన్ ఫస్ట్ పాలసీ రీసెర్చ్ సెంటర్ (NFPRC) ఆధ్వర్యంలో యాక్సెలరేటెడ్ ఇండియాస్ గ్రోత్: హౌ పార్లమెంటేరియన్స్ అండ్ లెజిస్లేటర్స్ కెన్ ఎనేబుల్ వికసిత్ భారత్ @2047 అనే అంశంపై తొలి వర్క్‌షాప్ ఢిల్లీలో నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, విధాన నిపుణులు పాల్గొన్నారు.

దేశ వృద్ధికి సంబంధించిన స్థూల ఆర్థిక దృక్పథంతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ పథకాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయన్న అంశాలపై లోతుగా చర్చించారు. NFPRC ఫౌండేషన్ చైర్‌పర్సన్ తరుణ్ చుగ్, బోర్డు మెంబర్ అభినవ్ ప్రకాశ్ పాల్గొని, శాసనసభ్యుల సామర్థ్యాన్ని పెంచే దిశగా పరిశోధన ఆధారిత విధాన చర్చలకు NFPRC కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ముఖ్య అతిథిగా హాజరైన డా. అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ, దేశంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధికి కేంద్రం-రాష్ట్రాల మధ్య మెరుగైన సమన్వయం, సంస్థల మధ్య ఐక్యత చాలా అవసరమన్నారు. పాలసీల అమలులో శాసనసభ్యుల పాత్ర మరింత బలంగా ఉండాలని ఆయన సూచించారు. సాంకేతిక సెషన్లలో ఐఎస్‌బీకి చెందిన రాజా బుజ్నూరి పీఎం స్వనిధి పథకం అమలుపై, మణి భూషణ్ ఝా జల్ జీవన్ మిషన్ కింద నీటి సరఫరా వ్యవస్థలపై వివరించారు.

Representative Image (Image Credit To Original Source)

V Anantha Nageswaran Representative Image (Image Credit To Original Source)

విధాన నిర్ణయాలు ప్రజలకు ఎలా నేరుగా ప్రయోజనం చేకూరుస్తాయో ఈ సెషన్లు స్పష్టంగా చూపించాయి. ఫెడ్ డైరెక్టర్ రాహుల్ అహ్లువాలియా భారత్ ఆర్థిక బలాలు, సవాళ్లు, భవిష్యత్ అవకాశాలపై స్థూల ఆర్థిక విశ్లేషణ చేశారు. వర్క్‌షాప్ ముగింపు సందర్భంగా, శాసనసభ్యులు, విధాన నిపుణులు, పరిశోధనా సంస్థల మధ్య నిరంతర పరస్పర సహకారం ఉంటేనే పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.