Bharat Biotech : కోవాగ్జిన్‌కు WHO క్లియ‌రెన్స్ వచ్చేనా? ఎందుకీ ఆలస్యమంటే?

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు ఇంకా లైన్ క్లియర్ కాలేదు. కోవాగ్జిన్ టీకాకు అత్య‌వ‌స‌ర వినియోగ అనుమ‌తి మ‌రింత ఆల‌స్యమయ్యేలా కనిపిస్తోంది.

Bharat Biotech : కోవాగ్జిన్‌కు WHO క్లియ‌రెన్స్ వచ్చేనా? ఎందుకీ ఆలస్యమంటే?

Covaxin Clearance

Updated On : September 28, 2021 / 11:43 AM IST

Covaxin Clearance Delayed : హైదరాబాద్ ఆధారిత డ్రగ్ మేకర్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు ఇంకా లైన్ క్లియర్ కాలేదు. కోవాగ్జిన్ టీకాకు అత్య‌వ‌స‌ర వినియోగ అనుమ‌తి మ‌రింత ఆల‌స్యమయ్యేలా కనిపిస్తోంది. కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేసే భార‌త్ బ‌యోటెక్ అభ్యర్థనను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) క్లియరన్స్ ఇవ్వలేదు. సాంకేతిక కారణాలను చూపుతూ డబ్ల్యూహెచ్ఓ భారత్ బయోటెక్ సంస్థను కొన్ని ప్రశ్నలు సంధించింది. వ్యాక్సిన్‌ విషయంలో సాంకేతిక‌ర‌ప‌ర‌మైన అంశాల‌పై స‌మాధానాలు కోరుతోంది.
US Marine: అమెరికా 250 ఏళ్ల చరిత్రలో మొదటిసారి..సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం..

ఈ నేపథ్యంలో కోవాగ్జిన్ టీకాకు ఆమోదం ఇప్పట్లో లభించే పరిస్థితులు కనిపించడం లేదు. తద్వారా విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. విదేశాలకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసే విద్యార్థులకు తిప్పలు తప్పేలా లేవు. అత్య‌వ‌స‌ర వినియోగ అనుమ‌తికి ఆమోదం లభించకపోవడంతో అనేక దేశాలు కోవాగ్జిన్ టీకాను గుర్తించలేదు. ఇప్పటికే ఈ కొవాగ్జిన్ టీకాకు చెందిన డేటాను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు స‌మ‌ర్పించినట్టు భార‌త్ బ‌యోట‌క్ వెల్లడించింది.

త్వ‌ర‌లోనే కోవాగ్జిన్‌కు WHO నుంచి అనుమతి వస్తుందని భావిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతలోనే WHO వర్గాల నుంచి కోవాగ్జిన్ అత్యవసర అనుమతికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది. ఇదివరకే కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్ లో డేటా ప్రకారం పరిశీలిస్తే.. కోవాగ్జిన్ 77.8 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని రుజువైంది.
Huzurabad By Poll Schedule : హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల