UP : భార్య స్నానం చేయడం లేదు..విడాకులు కావాలన్న భర్త
ప్రతి రోజు నా భార్య స్నానం చేయడం లేదు..నాకు విడాకులు కావాలి..స్నానం విషయంలో ప్రతి రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని...ఇది భరించలేకపోతున్నట్లు ఓ భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Talak
Wife Doesn’t Bathe : ప్రతి రోజు నా భార్య స్నానం చేయడం లేదు..నాకు విడాకులు కావాలి..స్నానం విషయంలో ప్రతి రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని…ఇది భరించలేకపోతున్నట్లు ఓ భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కానీ..తన బంధం కొనసాగేలా చూడాలని వివాహిత కోరుతోంది. కానీ…న్యాయం చెప్పాల్సిన వాళ్లు ఏం నిర్ణయం తీసుకోవాలా ? అని ఆలోచనలో పడ్డారు. వీరిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించాలని భావించారు. ఎందుకంటే..గృహహింస చట్టం కిందకు రానందున విడాకుల పరిధిలోకి రాదని అంటున్నారు. ఈఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Read More : Crow vs Drone : ఆకాశంలో ఎగిరే హక్కు మాది..నవ్వేంటి మాకు పోటీ..డ్రోన్ ను కూలదోసిన కాకి
క్వార్సీ గ్రామానికి చెందిన మహిళ, చందౌస్ గ్రామానికి చెందిన వ్యక్తితో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఘనంగా వివాహం జరిపించారు. వీరికి ఒక సంతానం. కొద్ది రోజులు సంసారం బాగానే జరిగినా..తర్వాత కుటుంబంలో కలహాలు ఏర్పాడ్డాయి. దీనికంతటికి కారణం..భార్య స్నానం చేయడం లేదని భర్త ఆగ్రహం వ్యక్తం చేస్తుండే వాడు. ఈ విషయంలో ప్రతి రోజు వాదులాడుకొనే వారు. చివరకు విసుగు చెందిన భర్త..మూడుసార్లు తలాక్..చెప్పాడు. వెంటనే ఆమె..ఆలీఘడ్ మహిళా రక్షణ సెల్ ను ఆశ్రయించింది.
Read More : Grandma Car Drivng : బామ్మా నువ్వు సూపర్.. 90ఏళ్ల వయసులో అద్భుతంగా కారు డ్రైవింగ్.. సీఎం సైతం ఫిదా
దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. తన భార్య ప్రతి రోజు స్నానం చేయడం లేదని, ఈ విషయంలోనే తామిద్దరం మధ్య గొడవలు జరుగుతున్నాయని కౌన్సిలింగ్ ఇస్తున్న వారికి తెలిపాడు. తమకు విడాకులు మంజూరు చేయాలని ఓ దరఖాస్తు సమర్పించాడు. దీనిని అతని భార్య అంగీకరించలేదు. తమ వివాహ బంధం కొనసాగే విధంగా చూడాలని…భార్య కోరింది. సమస్య చిన్నదే కావడంతో..వారికి మరిన్ని రోజులు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. గృహహింస చట్టం కిందకు రానందున…విడాకుల పరిధిలోకి రాదని..మహిళా రక్షణ సెల్ కౌన్సిలర్ వెల్లడించారు. వివాహ బంధాన్ని కాపాడుకోవాలంటే..భార్య, భర్తలు ఆలోచించుకోవాల్సి ఉంటుందని, వారి సహాయంతో…పరిష్కరిస్తామని కౌన్సిలర్ వెల్లడించారు.