మరో రాజా రఘువంశీ తరహా ఘటన.. ఇక్కడ ఇంకా ట్విస్ట్.. ప్రేమించి పెళ్లి చేసుకుని మరీ..
ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య ఘటన మరవకముందే అదేతరహా ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Rajasthan
Rajasthan: ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పెళ్లిజరిగిన కొద్దిరోజులకే భార్య సోనమ్ తో కలిసి రాజా రఘువంశీ మేఘాలయకు హనీమూన్ కు వెళ్లగా.. అక్కడ ప్రియుడితో కలిసి సోనమ్ రాజాను హత్య చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇదే తరహా ఘటన రాజస్థాన్‌లోని అల్వార్‌లో చోటు చేసుకుంది. ప్రేమించి పెండ్లి చేసుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్యచేసింది. ఈ ఘటనను తొమ్మిదేళ్ల కొడుకు కళ్లముందే జరిగింది.
రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా ఖేర్లికి చెందిన అనిత, వీరులు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరిదీ రెండో వివాహం. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అనిత ఖేర్లిలో ఓ చిన్న జనరల్ స్టోర్ నడిపేది. అదే ప్రాంతంలో కాశీరాం ప్రజాపత్ అనే వ్యక్తి కచోరి స్టాల్ ఏర్పాటు చేశాడు. కాశీరాం తరచూ అనిత దుకాణంకు వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో అనిత, కాశీరాం ప్రజాపత్ మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం తెలుసుకున్న వీరు.. భార్య అనితను నిలదీశాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు కాశీరాంతో కలిసి అనిత ప్లాన్ వేసింది.
అనిత, కాశీరాంతో కలిసి నలుగురు కిరాయి హంతుకులను మాట్లాడారు. వీరికి రూ.2లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. హత్యకు ప్లాన్ చేసిన రాత్రి సమయంలో అనిత ఉద్దేశపూర్వకంగా ఇంటి తలుపు తెరిచి ఉంచింది. కాశీరాం కిరాయి హంతకులు విష్ణు, నవీన్, చేతన్, బ్రిజేష్ జాతవ్ లతో కలిసి వీరు నిద్రిస్తుండగా ఇంట్లోకి వెళ్లారు. వీరు నిద్రిస్తుండగా అతని తలపై బలంగా కొట్టారు. దీంతో అతను స్పృహ కోల్పోవడంతో తరువాత దిండుతో ముఖంపై ఒత్తి, గొంతుకోసి చంపారు.
వీరు హత్య తరువాత అతని భార్య అనిత తన బంధువులకు ఫోన్ చేసి వీరు ఆకస్మిక అనారోగ్యం కారణంగా మరణించాడని చెప్పింది. మృతదేహంపై గాయాలు ఉండటంతో మృతుడు సోదరుడు గబ్బర్ జాతవ్ కు అనుమానం వచ్చింది. గొంతుపై కత్తితో కోసినట్లు ఉంది. దీంతో గబ్బర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా 100కిపైగా సీసీటీవీ పుటేజీలు పరిశీలించారు. ఫోన్ కాల్ రికార్డులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో మృతుడు భార్య అనితపై పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే, పోలీసులు వీరు, అనితల తొమ్మిదేళ్ల కుమారుడ్ని తన తండ్రి హత్య గురించి అడిగారు. దీంతో ఆ బాలుడు పోలీసులకు జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు.
‘‘నేను భయపడ్డాను. కాబట్టి నిశ్శబ్దంగా ఉన్నాను. ఆరోజు రాత్రి వాళ్లు మా గదికి వచ్చారు. అమ్మ మంచం ముందు నిలబడి ఉంది. వాళ్లు మా నాన్నను పట్టుకొని కొట్టారు. గొంతు నొక్కారు. కాశీ అంకుల్ మా నాన్న నోటిపై దిండుపెట్టి నొక్కాడు. నాన్నను కాపాడే ప్రయత్నం చేశాను. కానీ, కాశీ అంకుల్ నన్ను ఎత్తుకొని బెదిరించాడు. మౌనంగా ఉండమని హెచ్చరించాడు. దీంతో భయంతో నేను మౌనంగా ఉన్నాను. కొంతసేపటి తరువాత మా నాన్న పూర్తిగా కదలడం ఆపేశాడు. తరువాత అందరూ వెళ్లిపోయారు. అమ్మ ఏమీ మాట్లాడలేదు. అంతా దగ్గరుండి చూస్తూనే ఉంది. అమ్మ చాలా చెడ్డది.. ఆమె నాన్నను చంపేసింది’’ అని పోలీసులకు వీరు హత్య గురించి తొమ్మిదేళ్ల బాలు కళ్లకు కట్టినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు అనిత, ఆమే ప్రేమికుడు కాశీరాంతో పాటు బ్రిజేష్ జాతవ్ లను అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు విష్ణు, నవీన్, చేతన్ పరారీలో ఉన్నారు.
(थाना खेरली)
हत्या के मामले का खुलासा
पत्नि सहित 03 आरोपी गिरफ्तार पत्नि ने प्रेमी व अन्य आरोपियों के साथ मिलकर की पति की हत्या।@IgpJaipur @PoliceRajasthan pic.twitter.com/XmbnhYn2Ay— Alwar Police (@AlwarPolice) June 16, 2025