Sharad Pawar: భారత్ జోడో యాత్రకు శరద్ పవార్.. స్వయంగా ప్రకటించిన వెటరన్ లీడర్

నవంబర్‌ 7న మహారాష్ట్రలోకి భారత్‌ జోడో యాత్ర ప్రవేశించగానే అందులో పాల్గొనాలని కాంగ్రెస్‌ నేతలు అశోక్‌ చవాన్‌, బాలాసాహెబ్‌ థోరాట్‌ తనను కలిసి కోరారన్నారు. సమాజంలో సామరస్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ఈ యాత్రలో ఎక్కడ వీలైతే అక్కడ వివిధ పార్టీలకు చెందినవారు పాల్గొంటారన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్‌ 7న మొదలైన ఈ యాత్ర జమ్మూకశ్మీర్‌ వరకు కొనసాగనుంది. 150 రోజుల్లో 3,570 కి.మీల మేర కొనసాగనుంది.

Sharad Pawar: భారత్ జోడో యాత్రకు శరద్ పవార్.. స్వయంగా ప్రకటించిన వెటరన్ లీడర్

Will join Bharat Jodo foot march syas Sharad Pawar

Updated On : October 23, 2022 / 6:52 PM IST

Sharad Pawar: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొనసాగిస్తోన్న భారత్‌ జోడో యాత్రలో తానూ భాగస్వామినవుతానని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్‌ పవార్ ప్రకటించారు. సమాజంలో సామరస్యతను పెంపొందించేందుకు చేపట్టిన ఈ యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. తెలంగాణ ముగించుకుని మహారాష్ట్రలోకి ప్రవేశించాక తాను ఆ యాత్రలో పాల్గొననున్నట్టు వెల్లడించారు. ఆదివారం మహారాష్ట్రలోని బారామతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు పవార్.

నవంబర్‌ 7న మహారాష్ట్రలోకి భారత్‌ జోడో యాత్ర ప్రవేశించగానే అందులో పాల్గొనాలని కాంగ్రెస్‌ నేతలు అశోక్‌ చవాన్‌, బాలాసాహెబ్‌ థోరాట్‌ తనను కలిసి కోరారన్నారు. సమాజంలో సామరస్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ఈ యాత్రలో ఎక్కడ వీలైతే అక్కడ వివిధ పార్టీలకు చెందినవారు పాల్గొంటారన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్‌ 7న మొదలైన ఈ యాత్ర జమ్మూకశ్మీర్‌ వరకు కొనసాగనుంది. 150 రోజుల్లో 3,570 కి.మీల మేర కొనసాగనుంది.

ఇదిలా ఉంటే, బీసీసీఐ ఎన్నికల అంశంపైనా పవార్‌ స్పందించారు. బీసీసీఐ ఎన్నికలపైనా రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కొన్ని రంగాలపై రాజకీయాలు చేయకూడదని, అలా చేయడం అవివేకమన్నారు. తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గుజరాత్‌ నుంచి నరేంద్ర మోదీ, దిల్లీ నుంచి అరుణ్‌ జైట్లీ, హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

Maharashtra: తొందరలోనే శివసేన పని ఖతం.. కేంద్ర మంత్రి నారాయణ రాణె సంచలన వ్యాఖ్యలు