FIR ఎందుకు ఫైల్ చేయలేదు..ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం
ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్‌సింగ్‌కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై రూ. 100 కోట్ల వసూళ్ల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ పరమ్‌బీర్‌సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ని బుధవారం బాంబే హైకోర్టు విచారించింది.

Without Fir How Can You Ask For Our Intervention Bombay Hc Hears Pil By Param Bir Singh For Cbi Probe Against Anil Deshmukh
Bombay HC ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్‌సింగ్‌కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై రూ. 100 కోట్ల వసూళ్ల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ పరమ్‌బీర్‌సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ని బుధవారం బాంబే హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా.. సీబీఐ విచారణ కోరుతున్నారు మీరు చట్టానికి అతీతులా అని పరమ్‌బీర్‌సింగ్ ని ప్రశ్నించింది.
హోంమంత్రిపై వసూళ్ల ఆరోపణలు రావడంతో.. అత్యున్నత పదవిలో ఉండి కూడా ఎఫ్‌ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదని పరమ్‌బీర్ సింగ్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా ఎలాంటి విచారణ జరపలేం అనే విషయం మీకు తెలియదా.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు. నేరం జరుగుతుందని తెలిసినప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. అది మీ బాధ్యత కాదా అని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది
ఈ సందర్భంగా కోర్టు.. మీరు ఓ పోలీసు అధికారి. మీ కోసం చట్టాన్ని పక్కకు పెట్టాలా. మంత్రులు, రాజకీయ నాయకులు, పోలీసులు చట్టానికి అతీతులా.. మాకు ఏ చట్టాలు వర్తించవని మీ అభిప్రాయమా అంటూ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ లేకుండా తాము ఎలాంటి దర్యాప్తుకు ఆదేశించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టిన తరువాతే ఇక్కడికి రావాలని పరమ్‌బీర్‌సింగ్‌కు ముంబై హైకోర్టు సూచించింది.
కాగా,గత నెలలో ముంబైలోని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర పదార్థాలు కలిగిన వాహనం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసు సహచరుల తప్పిదాలకు పరమ్‌బీర్‌సింగ్ ని బాధ్యుడిగా చేస్తూ ఆయనను ముంబై పోలీస్ కమిషనర్ నుంచి హోంగార్డ్ డిపార్ట్మెంట్ కు డీజీగా బదిలీ చేస్తూ మహారాష్ట్ర హోంమంత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో.. అంబానీ బెదిరింపుల కేసులో అరెస్టయిన మాజీ పోలీసు అధికారి సచిన్‌వాజేతో హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌కు సన్నిహిత సంబంధాలున్నట్టు ఆరోపించారు పరమ్‌బీర్ సింగ్. నెలకు 100 కోట్ల రూపాయలు బార్లు, రెస్టారెంట్ల నుంచి వసూలు చేయాలని సచిన్ వాజేకు హోంమంత్రి టార్గెట్ విధించాడని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పరమ్ బీర్ సింగ్ లేఖ రాశాడు. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు.