Rape In Dream: కలలో అత్యాచారం.. మంత్రగాడిపై పోలీసులకు ఫిర్యాదు
ఈ సమయంలోనే మాంత్రికుడు తనపై అత్యాచారం చేసినట్లుగా సదరు మహిళా ఆరోపిస్తుంది. మంత్రగాడు అత్యాచారం జరిపిన సమయంలో చనిపోయిన తన కుమారుడు వచ్చి కాపాడదని చెబుతుంది. నాటి నుంచి తన మంత్ర శక్తితో కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తుంది. మంత్రగాడు చతుర్వేది తనను కలలో అత్యాచారం చేస్తున్నాడని బాధిత మహిళ కుద్వా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంత్రగాడిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

Rape In Dream
Rape In Dream: మంత్రగాడు కలలోకి వచ్చి తనపై అత్యాచారం చేస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వినడానికి కొంచం వింతగా ఉన్న ఇది నిజం.. వివరాల్లోకి వెళితే.. బీహార్ ఔరంగాబాద్ జిల్లాలోని గాంధీ మైదాన్‌లో ఓ మహిళ తన కుమారుడితో కలిసి నివాసం ఉంటుంది. జనవరిలో ఆమె కుమారుడికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో స్థానికంగా ఉండే మంత్రగాడు ప్రశాంత్ చతుర్వేదిని ఆశ్రయించింది.
రోగం బారినపడిన బాలుడు కోలుకోవాలంటే తానూ చెప్పిన మంత్రం జపించి కొన్ని క్రతువులు చెయ్యాల్సి ఉంటుందని ఆమెకు చెప్పాడు. దీంతో ప్రశాంత్ చతుర్వేది చెప్పినట్లుగానే 15 రోజులపాటు ఆ మంత్రం జపించి క్రతువులు జరిపింది. అయిన కుమారుడి ఆరోగ్యం కుదుటపడలేదు.. ఆరోగ్యపరిస్థితి మరింత విషమించి మృతి చెందాడు. దీంతో సదరు మహిళ బాబా వద్దకు వచ్చి తన కుమారుడు ఎందుకు చనిపోయాడని నిలదీసింది..
ఈ సమయంలోనే మాంత్రికుడు తనపై అత్యాచారం చేసినట్లుగా సదరు మహిళా ఆరోపిస్తుంది. మంత్రగాడు అత్యాచారం జరిపిన సమయంలో చనిపోయిన తన కుమారుడు వచ్చి కాపాడదని చెబుతుంది. నాటి నుంచి తన మంత్ర శక్తితో కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తుంది. మంత్రగాడు చతుర్వేది తనను కలలో అత్యాచారం చేస్తున్నాడని బాధిత మహిళ కుద్వా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంత్రగాడిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.
అయితే మహిళకు కూడా వైద్య పరీక్షలు చేయించాలని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని అనుమానిస్తున్నారు పోలీసులు