నీటిలో ప్రయాణిస్తున్న పడవలోనే ప్రసవం..

అస్సాంలోని ధెమాజీ జిల్లాలో ఓ యువతి దేశీవాలీ పడవలో ఓ బాబుకు జన్మనిచ్చింది. COVID-19 లాక్‌డౌన్ కారణంగా ట్రాన్స్ పోర్ట్ లేకుండాపోయింది. దీంతో ఉదయ్‌పూర్ మేచకీ ప్రాంతం నుంచి గర్భిణీని తీసుకుని బయల్దేరారు. ఆ సమయానికి పక్కనే ఉన్న పఖోరిగిరీ సపోరా ప్రాంతంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు.
విషయం హెల్త్ వర్కర్లకు తెలియజేయడంతో పడవను నీళ్లలోనే ఆపేయాలని వేరే పడవలో హెల్త్ వర్కర్లు అక్కడికి చేరుకున్నారు. మహిళను క్యాంపుకు తీసుకెళ్లేంత సమయం లేదని వృథా చేయకూడదని భావించి అక్కడే డెలివరీ చేయాలనుకున్నారు.
అటువంటి పరిస్థితుల్లోనూ హెల్త్ వర్కర్లు సేఫ్ గా డెలివరీ చేశారు. ఈ ఘటనను నేషనల్ హెల్త్ మిషన్ సోషల్ మీడియా షేర్ చేసింది. 19ఏళ్ల గర్భిణీకి పడవలోనే ప్రసవం చేశారని పేర్కొంది. పైగా అన్ని హైజెనిక్ పద్ధతుల్లోనే ఈ ప్రక్రియను ముగించారని, ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా శుభ్రంగా ఉంచారని అత్యవసరమైన జాగ్రత్తలు, గ్లౌజులు ధరించారని చెప్పింది.