Jagdeep Dhankhar: సోనియా వ్యాఖ్యలపై స్పందించడం నా బాధ్యత.. వివరణ ఇచ్చిన ఉపరాష్ట్రపతి ధన్‌కడ్
పార్లమెంట్ శీతాకాల సమావేశల్లో భాగంగా డిసెంబరు 21న సోనియా గాంధీ లోక్సభలో మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థ అధికారాన్ని, ఔన్నత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించారు. మంత్రులు, ఓ అత్యున్నత స్థాయి రాజ్యాంగబద్ధ అధికారి వివిధ కారణాలను చూపుతూ న్యాయ వ్యవస్థపై దాడి చేస్తూ ప్రసంగించేందుకు ఉద్యుక్తులయ్యారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు

Would have abjudicated my oath had I not reacted on UPA chairperson's remark: Jagdeep Dhankhar
Jagdeep Dhankhar: న్యాయ వ్యవస్థపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించకపోతే తాను తన ప్రమాణాన్ని తిరస్కరించినట్లు అయి ఉండేదని, తనకున్న రాజ్యాంగపరమైన బాధ్యతను నిర్వహించడంలో విఫలమైనట్లేనని రాజ్యసభ చైర్మన్ (ఉపరాష్ట్రపతి) జగదీప్ ధన్‌కడ్ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ కోరిన నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. సోనియా తన వ్యాఖ్యలకు అభిప్రాయాలకు చాలా దూరంగా ఉన్నారంటూ ధన్‌కడ్ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశల్లో భాగంగా డిసెంబరు 21న సోనియా గాంధీ లోక్సభలో మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థ అధికారాన్ని, ఔన్నత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించారు. మంత్రులు, ఓ అత్యున్నత స్థాయి రాజ్యాంగబద్ధ అధికారి వివిధ కారణాలను చూపుతూ న్యాయ వ్యవస్థపై దాడి చేస్తూ ప్రసంగించేందుకు ఉద్యుక్తులయ్యారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి చాలా భయానకమైన పరిస్థితులని, ప్రజల దృష్టిలో న్యాయ వ్యవస్థ విలువను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ సోనియా ఆరోపించారు.
కాగా, సోనియా వ్యాఖ్యలపై ఆ మర్నాడు, (డిసెంబర్ 22న) ధన్‌కడ్ స్పందింస్తూ.. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. అత్యున్నత స్థాయి రాజ్యాంగ పదవులను నిర్వహించేవారిని పక్షపాత వైఖరులకు ఆపాదించవద్దని రాజకీయ నేతలను ఆయన కోరారు. న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని తగ్గించడమనేది తన ఆలోచనకు అతీతమైందని అన్నారు. సోనియా వ్యాఖ్యలు తన అభిప్రాయాలకు చాలా దూరంగా ఉన్నాయని రాజ్యసభ చైర్మన్ ధన్‌కడ్ అన్నారు.