Youtuber Jyoti Malhotra: దేశద్రోహి..! యూట్యూబర్ ముసుగులో పాకిస్తాన్ కోసం పని చేసిన కిలేడీ..! ఎవరీ జ్యోతి మల్హోత్రా..
ఆమె యూట్యూబ్ ఛానల్ కు 3.77 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇన్ స్టా అకౌంట్ కు 1.5 లక్షల మంది ఉన్నారు.

Youtuber Jyoti Malhotra: ఉండేది భారత్ లో. పీల్చేది ఇక్కడి గాలి, తినేది ఇక్కడి తిండి. కానీ, పని చేసేది మాత్రం శత్రు దేశం పాకిస్తాన్ కోసం. భారత్ లో ఉంటూ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ గా పని చేసింది. భారత్ కు చెందిన కీలక, సున్నితమైన సమాచారాన్ని పాక్ కు చేరవేసింది. మన ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని శత్రువులకు చేరవేసింది. చివరికి పాపం పండింది. ఆ దేశ ద్రోహి పోలీసులకు చిక్కింది. గూఢచర్యం ఆరోపణలతో హర్యానాకు చెందిన లేడీ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎవరీ జ్యోతి మల్హోత్రా. అసలామె ఏం చేసేది? పాకిస్తాన్ కు ఎలా దగ్గరైంది? భారత్ నుంచి ఎలాంటి సమాచారం శత్రువులకు చేరవేసింది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జ్యోతి మల్హోత్రా గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.
జ్యోతి మల్హోత్రా.. జ్యోతి రాణిగా పాపులర్ చెందింది. ఆమెకు ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్. Travel with jo పేరుతో యూట్యూబ్ చానెల్ రన్ చేసింది. గూఢచర్యం ఆరోపణలతో పోలీసులు శనివారం జ్యోతిని అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్ తో ఒక్కసారిగా యావత్ దేశంలో అలజడి రేగింది. నార్త్ ఇండియా మొత్తం గూఢచర్యం నెట్ వర్క్ ఎంతో లోతుగా ఉందనే విషయం వెలుగుచూసింది.
జ్యోతి వయసు 33ఏళ్లు. హర్యానాలోని హిసార్ నివాసి. ఆమె యూట్యూబ్ ఛానల్ కు 3.77 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇన్ స్టా అకౌంట్ కు 1.5 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. తన యూట్యూబ్ చానల్ లో 500లకు పైగా వీడియోలు ఉన్నాయి. 53 లక్షల వ్యూస్ ఉన్నాయి. తనను తాను సాంప్రదాయ దృక్పథం ఉన్న ఆధునిక అమ్మాయిగా జ్యోతి చెప్పుకుంటుంది.
జ్యోతి మల్హోత్రా 2011లో తన యూట్యూబ్ చానల్ లాంచ్ చేసింది. ట్రావెల్ కు సంబంధించిన వీడియోలు అప్ లోడ్ చేసేది. భారత్ తో పాటు పాకిస్తాన్‌లోని అనేక గమ్యస్థానాల ప్రయాణానికి సంబంధించిన వీడియోలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది జ్యోతి. మార్చిలో పోస్ట్ చేసిన యూట్యూబ్ షార్ట్ లో తన పాకిస్తాన్ ప్రయాణాన్ని వివరించింది జ్యోతి. అక్కడికి హిందూ తీర్థయాత్రలను సందర్శించడానికి వెళ్లానని అందులో చెప్పింది.
సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన సమాచారంతో జ్యోతి బండారం బట్టబయలైంది. హిసార్ పోలీసుల CIA సిబ్బంది విచారణతో ఆమె నిజ స్వరూపం తెలిసిపోయింది. న్యూ అగర్సైన్ ఎక్స్‌టెన్షన్‌లోని ఆమె నివాసం నుండి పోలీసులు అరెస్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 152 అధికారిక రహస్యాల చట్టం, 1923లోని సెక్షన్ 3, 4 5 కింద పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. విచారణలో తాను చేసిన నేరాన్ని ఆమె ఒప్పుకుంది. దీంతో 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తరలించారు. కేసు తదుపరి దర్యాప్తు కోసం ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు.
ట్రావెల్ వ్లాగర్ ముసుగులో జ్యోతి పాక్ కు అనుకూలంగా పని చేసిందని.. తన ఛానెల్ ‘ట్రావెల్ విత్ JO’ ద్వారా పాకిస్తాన్ సానుకూల ఇమేజ్‌ను ప్రచారం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.