Gol Gappa Durga Mandapam : పానీ పూరీలతో నోరూరిస్తున్న దుర్గామాత మండపం

పువ్వులతో అలంకరించిన దుర్గామాతను చూశాం. కరెన్సీ నోట్లతో అలంకరణ చేసిన ధనలక్ష్మీ అమ్మవారిని చూసాం. కూరగాయలతో అలకరించిన శాఖాంభరిదేవిని చూశాం. కానీ పానీపూరీలతో అలంకరించిన అమ్మవారిని చూశారా..? నోరూరిస్తున్న దుర్గమ్మ మండపం వైరల్ అవుతోంది.

Gol Gappa Durga Mandapam : పానీ పూరీలతో నోరూరిస్తున్న దుర్గామాత మండపం

pani puri durga mata mandapam

Updated On : October 18, 2023 / 4:14 PM IST

Gol Gappa Durga Mandapam In Kolkata : కలకత్తా కాళి అంటే దేశ వ్యాప్తంగా ఎంత పేరుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అటువంటి  కోల్ కతాలో దసరా ఉత్సవాల వేడుకలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. ప్రత్యేక అలంకరణలతో దుర్గామాత మందిరాలు వెలిగిపోతున్నాయి. ఏ మందిరం ప్రత్యేక దానిదే అన్నట్లుగా కొలువుతీరిన అమ్మవార్లు వెలుగొందుతున్నారు.

కోల్ కతా కళాకారులు దుర్గామాతలను వివిధ రూపాల్లో కళాకారులు రూపొందిస్తుంటారు.హైదరాబాద్ లో గణనాధులు ఎంత వినూత్నంగా పలు రూపాల్లో దర్శనమిస్తారో కోల్ కతాలో దుర్గామాతలు అన్ని రూపాల్లో కనువిందు చేస్తుంటారు. కోల్‌కతాలో జరిగే దుర్గా పూజలలో భక్తుల సృజనాత్మకత కనిపిస్తుంటుంది.

దీంట్లో భాగంగా కోల్ కతా నగరంలోని దక్షిణ శివారు బెహలాలోని ఒక దుర్గామండపాన్ని నిర్వాహకులు వినూత్నంగా డెకరేట్ చేశారు. ఈమందిరంలో అమ్మవారిని చూస్తే ఎంత భక్తిభావం కలుగుతుందో..అక్కడి డెకరేషన్ చూస్తే నోరు కూడా ఊరిపోతుంది.ఎందుకంటే దుర్గామాత మందిరాన్ని పానీపూరీలతో అలంకరించారు. ఈ మందిరంలో ఎక్కడ చూసినా పానీపూరీలే కనిపిస్తున్నాయి. అందుకే ఈ మందిరం అందంలో మాత్రమే కాదు రుచిలో కూడా పోటీ పడుతోంది. పానీపూరీలతో దుర్గామాత మందిరం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బెహలా నోటున్ దాల్ క్లబ్ ఏర్పాటు చేసిన దుర్గా మండపం వీడియోను వీడియోను వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా పోస్ట్ చేసారు. దీంతో ఈ మండపాన్ని గోల్ గప్ప్ మందిరం అని పిలుస్తున్నారు. చాలామందికి ఇష్టమైన ఈ స్ట్రీట్‌ ఫుడ్‌తో దుర్గాపూజను ముడిపెట్టడం నిజంగా డిఫరెంట్ అంటున్నారు. మరి మీరు కూడా పానీపూరీలతో నోరూరిస్తున్న అమ్మవారి మండపంపై ఓ లుక్కేయండి..