Boy police complaint : అమ్మ పోరు భరించలేకపోతున్నాను అనాథాశ్రమంలో చేర్పించాలంటూ పోలీసులకు 10ఏళ్ల పిల్లాడు ఫిర్యాదు

మా అమ్మపై కేసు పెట్టండి..ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపండీ, ఇక నేను ఆ ఇంట్లకి వెళ్లను, మా అమ్మతో కలిసి ఉండటం నాకిష్టంలేదు..నన్ను ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Boy police complaint : అమ్మ పోరు భరించలేకపోతున్నాను అనాథాశ్రమంలో చేర్పించాలంటూ పోలీసులకు 10ఏళ్ల పిల్లాడు ఫిర్యాదు

Boy police complaint on Mother

Updated On : August 18, 2023 / 3:43 PM IST

Boy police complaint on Mother : ఇటీవల కాలంలో చిన్న చిన్న పిల్లలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తల్లిదండ్రులపై ఫిర్యాదు ఇవ్వటం చూస్తున్నాం. ‘‘మానాన్న మద్యం తాగి వచ్చి మా అమ్మను కొడుతున్నాడు మానాన్న అరెస్ట్ చేయండీ సార్’’ అంటూ మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్ లో మూడేళ్ల పిల్లాడు ‘‘మా అమ్మ నాకు తల స్నానం చేయించాక కళ్లకు కాటుక పెడుతోంది..మానాన్న నా కోసం తెచ్చిన చాక్లెట్లు అన్నీ దాచేస్తోంది’’అంటూ తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాంటి ఓ పిల్లాడి తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Yarlagadda Venkata Rao: యార్లగడ్డ వెంకట్రావు సంచలన నిర్ణయం.. వైసీపీకి గుడ్ బై చెప్పి, చంద్రబాబు వద్దకు..

చైనాలోని ఛాంగ్ క్వింగ్ టౌన్ 10 ఏళ్ల పిల్లాడు తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘‘హోమ్ వర్క్ చేయమని మా అమ్మ అదే పనిగా సతాయిస్తోంది. ఆమె పోరు భరించలేకపోతున్నా..మా అమ్మపై కేసు పెట్టండి..ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపండీ, ఇక నేను ఆ ఇంట్లకి వెళ్లను, మా అమ్మతో కలిసి ఉండటం నాకిష్టంలేదు..నన్ను ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించండి’’అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ పిల్లాడి ఫిర్యాదు విన్న పోలీసులు విన్న పోలీసులు నవ్వుకున్నారు. కానీ ఆ పిల్లాడు మాత్రం ఫిర్యాదు తీసుకోవాల్సిందే..ఇంటికి వెళ్లను అంటూ పట్టుపట్టాడు.

Bandi Sanjay in AP politics : ఏపీ రాజకీయాల్లోకి బండి సంజయ్ ఎంట్రీ .. త్వరలోనే ఏపీకి తెలంగాణ బీజేపీ నేత

ఆ పిల్లాడు చెప్పేంది శ్రద్ధగా విన్న పోలీసులు చాలా రకాలుగా నచ్చ చెప్పారు. నెమ్మదిగా బాలుడి నుంచి ఇంటి అడ్రస్ వాళ్ల అమ్మానాన్నల వివరాలు తెలుసుకున్నారు. వాళ్లకు ఫోన్ చేసిన స్టేషన్ కు రప్పించారు. వాళ్లతో మాట్లాడారు. హోంవర్క్ చేయట్లేదని కొడుకును మందలించిన మాట నిజమేనని అంగీకరించింది ఆమె. ఆ తరువాత పిల్లాడి తల్లిదండ్రులు కొడుకుకు సర్దిచెప్పి తమతో తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.