Police Complaint on Slippers theft : నా చెప్పులు ఎవరో కొట్టేశారు సార్ అంటూ పోలీసులకు ఫిర్యాదు .. ఏపీలో కాదండీ బాబూ
నా చెప్పులు ఎవరో దొంగిలించారు సార్..దొంగను పట్టుకుని కఠినంగా శిక్షించండీ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. పోలీసులు ఏమన్నారంటే..

UP Man Police complaint on slippers theft
UP Man Police complaint on slippers theft : నా చెప్పులు ఎవరో కొట్టేశారు సార్ అదేనండీ దొంగిలించారు అంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెప్పులు పోయాయి అంటూ ఫిర్యాదు చేయటానికి వచ్చిన వ్యక్తిని ఎగాదిగా చూశారు పోలీసులు ఆశ్చర్యంగా.. అతను చెప్పేది నిజమేనని తెలిసి నవ్వుకున్నారు. సాధారణంగా మనం గుడికి వెళ్లిన సందర్భంలో చెప్పులు పోతుంటాయి. వార్నీ నా చెప్పులు ఎవరో కొట్టేశార్రోయ్ అనుకుంటాం. కాస్త కోపం వస్తుంది..కానీ చేసేది లేక మౌనంగా వెళ్లిపోతాయం. కానీ యూపీలో ఓ వ్యక్తి అలా ఊరుకోలేదు. నా చెప్పులు నాకు కావాలి అంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు.
Bihar : అసలే గుండు ఇంకేం గీస్తార్రా బాబూ .. షాక్ మామూలుగా లేదుగా..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కాంతిలాల్ నిగమ్ అనే వ్యక్తి గత ఆదివారం (జులై 9,2023) స్థానికంగా ఉండే భైరవ్ బాబా ఆలయానికి వెళ్లాడు. అందరిలాగానే గుడి బయట వదిలి దర్శనం కోసం లోపలికెళ్లాడు. దర్శనం చేసుకుని వచ్చి చూస్తే అతని కొత్త చెప్పులు కనిపించలేదు. అక్కడంతా వెదికాడు కానీ కనిపించలేదు. గుడికి వెళితే చెప్పులు మిస్ అవ్వటం సర్వసాధారణంగా జరిగేదే. అదే గుర్తుకొచ్చింది కాంతిలాల్ కు . కానీ నా చెప్పుల్ని నేనెందుకు వదులుకోవాలి.. అని అనుకున్నాడు.
అంతే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు. తరువాత నవ్వుకున్నారు. కానీ అతను మాత్రం అవేవీ పట్టించుకోలేదు. ‘సార్ భైరవ్ బాబా గుడి వద్ద నా చెప్పులు పోయాయి..ఎవరో ఎత్తుకెళ్లిపోయి ఉంటారు. అవి కొత్త చెప్పులు..వాటి సైజు 7 అంగుళాలు, నీలం రంగు చెప్పులు ఆక్యుప్రెషర్ చెప్పులు’ అంటూ చెప్పులకు సంబంధించిన వివరాలు అన్నీ సవివరంగా చెప్పి మరీ ఫిర్యాదు చేశాడు. అంతేకాదు ఆ చెప్పులు కొన్న బిల్లు కూడా చూపించాడు. చెప్పుల దొంగని పట్టుకుని శిక్షించాలని కూడా కోరాడు.అంతా సావధానంగా విన్న పోలీసులు మొదట నవ్వుకున్నా నిబంధనల ప్రకారం ఫిర్యాదు తీసుకున్నారు. మీ చెప్పుల దొంగ ఎవరో తెలుసుకుంటామని భరోసా ఇవ్వటంతో అతను వెళ్లిపోయాడు. దీనికి సబందించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Uttar Pradesh : జైలుకెళ్లాలనే భయంతో పోలీస్‌స్టేషన్‌లో బల్లిని మింగేసిన అత్యాచార కేసు నిందితుడు