Mahendra Singh Dhoni : పూర్వీకుల గ్రామంలో MS ధోనీ .. మిస్టర్ కూల్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా

మహేంద్ర సింగ్ ధోని. క్రికెట్ లో ఓ సంచలనం. ధోని తన భార్యా బడ్డతో కలిసి తన పూర్వీకుల గ్రామం వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిస్టర్ కూల్ సిప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Mahendra Singh Dhoni : పూర్వీకుల గ్రామంలో MS ధోనీ ..  మిస్టర్ కూల్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా

Mahendra Singh Dhoni visiting his ancestral village

Updated On : November 18, 2023 / 4:28 PM IST

MS Dhoni visiting ancestral village Lwali : మహేంద్ర సింగ్ ధోని. క్రికెట్ లో ఓ సంచలనం. మిస్టర్ కూల్ గా పేరొందిన ఈ క్రికెటర్ అంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు..క్రికెట్ చరిత్రలో ధోని ఓ ఉవ్వెత్తున ఎగసిపడే ఓ కెరటం. ధోనీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌కు ప్రకటించినా అతని క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. సింపుల్ సిటీగా ఉండే ఈ క్రికెట్ ఎక్కడికెళితే అక్కడే అతని అభిమానులతో పాటు స్థానికులు అభిమానంతో చుట్టుముట్టేస్తుంటారు. క్రికెటర్ గా ఎంత పేరు సంపాదించాడో కాంట్రవర్సీలకు అంత దూరంగా ఉంటడీ మిస్టర్ కూల్. తన కష్టంతో కోట్ల ఆస్తులు కూడబెట్టిన అంతకుమించి కోట్లాదిమంది అభిమానాన్ని చూరగొన్న క్రీడాకారుడు. బైకులంటే ప్రాణం పెట్టే ఈ కెప్టెన్ కూల్ సింపుల్ సిటీకి కేరాఫ్ అడ్రగా ఉంటారు.

ఇంతకీ ఈ మిస్టర్ పర్ ఫెక్ట్..మిస్టర్ కూల్ గురించి ప్రత్యేకించి ఎన్నైనా చెప్పొచ్చు. రికార్డులు, రివార్డులు ఇలా ఎంతో చెప్పొచ్చు. తాజాగా.. క్రికెట్ వరల్డ్ కప్ (2023)మానియా కొనసాగుతున్న తరుణంలో ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే..ప్రపంచం మరీ ముఖ్యంగా వరల్డ్ కప్ ఫైనల్ మానియాలో ఉంటే..ఈ మిస్టర్ కూల్ మాత్రం తన భార్య సాక్షి సింగ్.కుమార్తె జీవాతో కలిసి తన పూర్వీకుల గ్రామాన్ని సందర్శించారు. అక్కడ స్థానికులతో అత్యంత సామాన్యుడిలా కలిసిపోయారు ధోని. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాస్ లోని తమ పూర్వీకులు నివశించిన ల్వాలి అనే గ్రామాన్ని సందర్శించారు ధోని.

షమి స్వగ్రామం సాహస్‌పూర్ అలీనగర్‌కు మహర్దశ…యూపీ సర్కారు కొత్త ప్రతిపాదనలు

అక్కడ ఆయన్ని గ్రామస్తులు చుట్టుముట్టారు. అభిమానంతో ఆలింగనం చేసుకున్నారు. ధోని కూడా స్వచ్ఛమైన చిరునవ్వుతో వారిని ఆలింగనం చేసుకున్నారు. వారికి పాదాభివందనం చేశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన భార్యతో కలిసి ఆ గ్రామం అందాలను చూస్తు ఆస్వాదించారు. ఓ ఇంటిముందు భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్న ఫోటో వైరల్ అవుతోంది.

సుమారు 20 ఏళ్ల తర్వాత అల్మోరా జిల్లా కేంద్రానికి వెళ్లిన ధోనీ అక్కడికి సమీపంలోని ల్వాలి గ్రామంలో ఫ్యామిలీతో కలిసి కలియతిరిగారు. ఆ ప్రాంతాన్ని మనసారా ఆస్వాదించారు. గ్రామస్తులతో చక్కగా కలిసిపోయారు. గ్రామ పెద్దల పాదాలను నమస్కరించారు.ఆశీస్సులు తీసుకున్నారు.ఆప్యాయంగా పలకరించాడు. గ్రామస్తులు ధోనీతో ఫొటోలు..సెల్ఫీలు తీసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపారు. ధోనీ కూడా వారితో కలిసి ఎంజాయ్ చేశారు. వారితో ఫొటోలు దిగుతూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు. పూర్వీకుల గ్రామంలో ధోని కుటుంబం పర్యటన..మిస్టర్ కూల్ సింప్లిసిటీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ధోనీ కుటుంబంతో కలిసి ఆ గ్రామాన్ని సందర్శించటంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.

 

View this post on Instagram

 

A post shared by Defolter papola (@daksh_papola)